Don't Miss!
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఛార్మిని టచ్ చేశాడట.. ఏకంగా వీడియో పోస్ట్ చేసిన నిర్మాత.. వైరల్
ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి ప్రస్తుతం ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. ఆమె నిర్మించిన తాజా సినిమా ఇస్మార్ట్ శంకర్ ఉహించినదానికి మించిన రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఆ సినిమా సక్సెస్‌ని తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రేక్షకులను పలకరిస్తూ వస్తోంది. అంతేకాదు ప్రతీ చోట జరిగిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది కూడా. ఈ నేపథ్యంలో ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? వివరాల్లోకి పోతే..
సక్సెస్ టూర్.. భారీ రెస్పాన్స్
ఇస్మార్ట్ శంకర్ రూపంలో మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించడమే కాదు.. డైరెక్ట్‌గా వారి వారి ప్రదేశాలకు వెళ్లి ఈలలు, గోళాలు పెట్టిస్తున్నారు ఛార్మి అండ్ టీం. వీళ్లకు ప్రేక్షకులు సైతం స్వాగతం పలుకుతూ తమ తమ అభిమానం చాటుకుంటున్నారు. కొంతమంది స్పెషల్‌గా ఛార్మి, పూరి జగన్నాథ్ లను సర్ప్రైజ్ చేస్తున్నారు.
పూరిపై అభిమానం ఎక్కువై
ఈ నేపథ్యంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై అభిమానంతో ఓ వ్యక్తి ఏకంగా పూరి జగన్నాథ్ టాటూని తన హృదయంపై వేసుకొని వచ్చాడు. ఈ టాటూని పూరి అండ్ టీం కి చూపించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. పక్కనే ఉండి ఛార్మి ఈ ఉందంతాన్ని వీడియో తీసి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.
|
తన హృదయాన్ని తాకాడు అంటూ
పూరి హార్డ్ ఫ్యాన్ అయిన ప్రభాకర్.. తన హృదయాన్ని టచ్ చేశాడంటూ ఛార్మి సదరు వీడియోపై ట్యాగ్ చేసింది. అంతేకాదు అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలిపింది ఛార్మి. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. పూరి, రామ్ అభిమానులు ఇస్మార్ట్ శంకర్ విజయంపై, ఛార్మి చేస్తున్న ఈ ట్వీట్స్ పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇస్మార్ట్ శంకర్ మూవీ
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి తెరకెక్కించారు. చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. నిధి, నభా గ్లామర్ డోస్ తెలుగు ప్రేక్షకుల దిమాక్ ఖరాబ్ చేస్తోంది. పూరి జగన్నాథ్ సహా హీరో రామ్, హీరోయిన్లు నిధి, నభా ఇద్దరికీ ఈ సినిమా అందించిన విజయం టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.