బిడ్డను ప్రేమగా నిమురుతున్న ఛార్మీ.. వీడియో వైరల్
సెలెబ్రిటీల్లో ఎక్కువ మంది జంతు ప్రేమికులుంటారు. వారు తమ పెట్స్‌ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. విదేశాల నుంచి స్పెషల్ బ్రీడ్ ఉన్న కుక్కలను తెప్పించుకుని మరీ పెంచుకుంటారు. అలా మంచు, మెగా, అక్కినేని ఫ్యామిలీల్లో ఎన్నో రకాల పెట్స్ ఉన్నాయి. ఈ అందరిలోకెల్లా ఛార్మీ దగ్గరున్న పెట్‌ను చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. అది సింహమా? లేదా పెంపుడు కుక్కనా? అని అనుమానం వ్యక్తం చేయాల్సిందే.
అది మామూలు పెంపుడు కుక్క కాదట.. తన బిడ్డ అంటూ చార్మి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. గత నెలలో ఛార్మీ షేర్ చేసిన ఓ ఫోటో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. తన తొమ్మిదేళ్ల బిడ్డతో ప్రభాస్ అంటూ ఓ క్యాప్షన్ పెట్టేసి అలస్కన్ మలమూటేను అందరికీ పరిచయం చేసింది. అందులో ప్రభాస్ లుక్, ఆ పెట్ లుక్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఆ పెట్ చూడటానికి సింహంలా ఉంటే వెనకాల ఉన్నది నిజమైన సింహమని కామెంట్లు చేశారు.

తాజాగా ఛార్మీ మరో వీడియోను షేర్ చేసింది. ఇందులో తన తొమ్మిది నెలల బిడ్డను తెగ గారాభం చేస్తోంది. పిల్లలను తల్లి ఎంత ప్రేమగా నిమురుతుందో.. అంతే ప్రేమతో తన పెట్‌ను నిమురుతూ చార్మీ మురిసిపోయింది. తన అమ్మ చేతి స్పర్శను వాడు కచ్చితంగా ప్రేమిస్తాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ఆ పెట్ మామూలుగా లేదని కామెంట్లు పెడుతున్నారు. ఛార్మీ ప్రస్తుతం ముంబైలో ఉందన్న సంగతి తెలిసిందే. ఫైటర్ మూవీ షూటింగ్‌ను మళ్లీ త్వరలోనే ప్రారంభించనున్నారు.


Click it and Unblock the Notifications











