పోకిరి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ మహేష్ బాబు కాదా? ఏ హీరోతో పూరీ జగన్నాథ్ ప్లాన్ చేశాడంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో సంచలన విజయం సాధించిన చిత్రాల్లో పోకిరి ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ఇలియానా హీరోయిన్‌గా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రేడ్ అంచనాల లెక్కలను తలదన్నేలా కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సినిమా మహేష్, పూరీ జగన్నాథ్ బ్రాండ్ ఇమేజ్‌ను మార్కెట్‌లో పెంచింది. అయితే పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి 24 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్లోకి వెళితే..
పోకిరి మూవీకి ముందు పూరీ జగన్నాథ్ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకొన్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో బద్రి, మాస్ మహరాజ్ రవితేజతో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ, నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇడియట్ సినిమాలను హిట్ చేసి హ్యాట్రిక్ కాంబినేషన్‌ను ఎస్టాబ్లిష్ చేశారు. వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు.

రవితేజ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌కు క్రేజ్ ఉండటంతో మళ్లీ అదే రిపీట్ చేయాలని ప్లాన్ చేశారు. ముందుగా రవితేజ హీరోగా పోకిరి కథను సినిమాగా తీయాలని ప్లాన్ చేశారు. ఈ సినిమాకు నాగబాబు నిర్మాతగా సిద్దమయ్యారు. ఈ సినిమాకు సంబంధించి ప్రకటన కూడా అధికారికంగా బయటకు వచ్చింది.
అయితే ఆ సమయంలో రవితేజ ముందుగా ఒప్పుకొన్న సినిమాలు ఇబ్బంది క్రియేట్ చేశారు. అయితే డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం, అర్జెంట్‌గా పూరీ సినిమా మొదలుపెట్టాల్సిన అవసరం ఉండటంతో మహేష్ బాబును అప్రోచ్ అయ్యారు. అయితే మహేష్ కూడా కథ బాగా నచ్చడంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ కొన్ని కీలక మార్పులు చేయాలని సూచించరట. అందుకు పూరీ ఒప్పుకోవడంతో సినిమా ప్రారంభమైంది.
అయితే మహేష్ సినిమాకు పూరీ రకరకాల టైటిల్స్ అనుకొన్నారు. అయితే ఓ రోజు మహేష్‌తో టైటిల్ ఫిక్స్ అయిందని పూరి చెప్పారట. అయితే టైటిల్ ఏమనుకొంటున్నారని మహేష్ అడిగితే.. పోకిరి అని చెప్పారట. దాంతో ఆ టైటిల్ ఏమిటి అని నవ్వుకొన్నారట. చివరకు పోకిరి టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే పోకిరి సినిమా తొలి ఆట నుంచి బ్లాక్‌బస్టర్ టాక్‌తో థియేట్రికల్ రన్ మొదలుపెట్టింది. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో సినిమా చూసిన సూపర్ స్టార్ కృష్ణ.. మీడియాతో మాట్లాడుతూ.. ఇండస్ట్రీ హిట్ కాబోతున్నది. 40 కోట్లు కలెక్ట్ చేస్తుందని జోస్యం చెప్పారు. ఆయన చెప్పినట్టే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా మారింది.

పోకిరి సినిమా బడ్జెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాను సుమారుగా 12 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా సుమారుగా 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మగధీర పేరున రికార్డు ఉండేది. ఆ సినిమా రికార్డును అధిగమించడమే కాకుండా 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. అయితే ఈ సినిమా కథలో మహేష్ చెప్పిన మార్పులు, ఈ సినిమాకు ముందుగా అనుకొన్న టైటిల్‌కు సంబంధించిన మరో వార్త కోసం ఫిలింబీట్ పాలో అవ్వండి..


Click it and Unblock the Notifications











