‘డబుల్ ఇస్మార్ట్’... సీక్వెల్ కోసం టైటిల్ రిజిస్టర్ చేయించిన పూరి!
టాలీవుడ్ ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్ హిట్టు కొట్టి చాలా కాలం అయింది. వరుస పరాజయాలు చవి చూసిన ఆయన 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో ఎట్టకేలకు విజయం అందుకున్నాడు. గురువారం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ మాస్ యాక్షన్, నబా నటేష్, నిధి అగర్వాల్ గ్లామర్ సినిమాకు మరింత ప్లస్ అయింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో.... పూరి జగన్నాథ్ అండ్ టీమ్ పార్టీ మూడ్లోకి వెళ్లిపోయారు. సంబరాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల అభిమానులు రామ్ కటౌట్లకు బీర్లతో అభిషేకాలు చేస్తుండటం గమనార్హం.
డబల్ ఇస్మార్ట్ పేరుతో త్వరలో సీక్వెల్
‘ఇస్మార్ట్ శంకర్' మూవీ ఇచ్చిన జోష్‌తో పూరి త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘డబల్ ఇస్మార్ట్' పేరుతో ఈ మూవీ ఉంటుందట. ఇప్పటికే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు. ఈ విషయం పూరి అఫీషియల్‌గా ప్రకటించారు.

తర్వాత నుంచి అదే పనిలో ఉండనున్న పూరి
‘డబల్ ఇస్మార్ట్'కు సంబంధించిన స్టోరీ లైన్ పూరి జగన్నాధ్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నారట. అయితే స్క్రిప్టు వర్క్ పూర్తి చేయాల్సి ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్' హిట్టయితే దీన్ని డెవలప్ చేయాలనుకున్నారట. ఆయన అనుకున్నట్లే సినిమా హిట్ కావడంతో నెక్ట్స్ నుంచి ఆయన ఇదే పని మీద ఉంటారని తెలుస్తోంది.

ఈ ఒక్క మూవీతో పూరి నష్టాలన్నీ...
పూరి జగన్నాధ్, చార్మి కలిసి ఇప్పటి వరకు పలు చిత్రాలు నిర్మించారు. అయితే ఆ సినిమాలన్నీ దాదాపు నష్టాలే మిగిల్చాయి. అయితే ఈ నష్టాలన్నింటినీ ‘ఇస్మార్ట్ శంకర్' మూవీతో తీరడ ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ విశ్లేషకులు.

ఇస్మార్ట్ శంకర్
రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నరు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రియల్ సతీష్, సాహిత్యం: భాస్కరభట్ల, ఎడిటర్: జునైద్ సిద్ధికీ, ఆర్ట్: జానీ షేక్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











