విజయ్ దేవరకొండను భయపెడుతోన్న స్టార్ డాటర్: ఆ వీడియోతో అనుమానాలు మొదలు!

By Manoj Kumar P

కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలు అందుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు టాలెంటెడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు' అనే సినిమాలో డీసెంట్‌గా కనిపించిన అతడు... ఆ వెంటనే వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో తనలోని మరో యాంగిల్ చూపించాడు. ఫలితంగా యూత్ ఐకాన్‌గా మారిపోయాడు. అదే సమయంలో మరిన్ని విజయాలు అందుకుని దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు బాలీవుడ్‌పైనా కన్నేశాడు. అంతా సవ్యంగా సాగిపోతుందనుకుంటున్న వేళ... విజయ్‌ను ఓ స్టార్ హీరో కూతురు భయపెడుతోంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

వరుసగా ఫ్లాపులు... విజయ్‌కు బ్రేకులు

వరుసగా ఫ్లాపులు... విజయ్‌కు బ్రేకులు

‘పెళ్లి చూపులు', ‘అర్జున్ రెడ్డి', ‘గీత గోవిందం', ‘టాక్సీవాలా' వంటి సూపర్ హిట్లను అందుకుని తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే, కొద్ది రోజులుగా అతడి కెరీర్ గ్రాఫ్ పడిపోతోంది. ఇటీవలి కాలంలో అతడు నటించిన ‘నోటా' ‘డియర్ కామ్రేడ్', ‘వరల్డ్ ఫేమస్ లవర్' బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి.

బడా డైరెక్టర్‌ సాయంతో బాలీవుడ్ ఎంట్రీ

బడా డైరెక్టర్‌ సాయంతో బాలీవుడ్ ఎంట్రీ

టాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతోన్న విజయ్ దేవరకొండ.... బాలీవుడ్‌లోనూ సత్తా చాటాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఛార్మీ, పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. దీనికి ‘ఫైటర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ఆయన ఎంట్రీ... సినిమా రేంజ్ పెరిగింది

ఆయన ఎంట్రీ... సినిమా రేంజ్ పెరిగింది

వాస్తవానికి ఈ సినిమాను తెలుగులో మాత్రమే తెరకెక్కించాలని చిత్ర యూనిట్ మొదట భావించింది. అయితే, ఈ మూవీ కథ తెలుసుకున్న బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్... దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తీయాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు, దీనికి నిర్మాణ భాగస్వామిగానూ చేరిపోయారు. అలాగే, కథలో మార్పులు కూడా చేసి విజయ్‌ను హిందీలో పరిచయం చేస్తున్నారు.

ముంబైలో ఆమెతో దేవరకొండ హల్‌చల్

ముంబైలో ఆమెతో దేవరకొండ హల్‌చల్

తన బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయినప్పటి నుంచి విజయ్ దేవరకొండ ముంబై నగరంలోనే ఎక్కువగా కనిపించాడు. బాలీవుడ్ సెలెబ్రిటీలతో పార్టీల్లో కూడా పాల్గొన్నాడు. అందుకు అనుగుణంగానే ఈ మూవీ షూటింగ్ కూడా ముంబైలోనే జరుపుతున్నారు. ఆ సమయంలోనే హీరోయిన్‌తో అతడు చేసిన సీన్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.

విజయ్‌ను భయపెడుతోన్న స్టార్ డాటర్

విజయ్‌ను భయపెడుతోన్న స్టార్ డాటర్

ముంబైలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా ‘ఫైటర్' మూవీ షూటింగ్ వాయిదా పడింది. దీంతో లొకేషన్ మార్చాలని అనుకున్నా అది వీలు కాలేదు. ఈ నేపథ్యంలో పరిస్థితులు చక్కబడే వరకు షూటింగ్ ప్రారంభచకూడదని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ డాటర్, ఈ చిత్ర హీరోయిన్ అనన్య పాండే రూపంలో యూనిట్‌కు కొత్త టెన్షన్ పట్టుకుంది.

ఆ వీడియోతో అనుమానాలు మొదలు.!

ఇషాన్ - అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖాళీ పీలీ'. మక్బూల్ ఖాన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు మెహ్రా నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. దీనికి వ్యూస్ పరంగా మంచి స్పందన వచ్చినప్పటికీ... డిజ్ లైక్స్ రూపంలో షాక్ తగిలింది. ఇప్పటికే దీనికి 1.7 మిలియన్ డిజ్ లైక్స్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Recommended Video

Happy Birthday Vijay : Thalapathy Vijay Box Office Career
యంగ్ హీరో ఆత్మహత్య ప్రభావంతోనే..

యంగ్ హీరో ఆత్మహత్య ప్రభావంతోనే..

‘ఖాళీ పీలీ'కి వ్యతిరేకత రావడం వెనుక సుశాంత్ సింగ్ ఆత్మహత్య ప్రభావం ఉందన్న విషయం తెలిసిందే. అనన్య తండ్రి చుంకీ పాండేపై వ్యతిరేకతతోనే ఇలా జరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని విజయ్ దేవరకొండ ‘ఫైటర్'పైన కూడా ఆ ప్రభావం ఉండబోతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే, కరణ్ జోహార్‌పై వ్యతిరేకత కూడా ఎఫెక్ట్ చూపుతుందన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X