ఇస్మార్ట్ పాప నిజంగా సూపర్ స్మార్ట్..! చూడండి ఏం చేసిందో..
దేశ వ్యాప్తంగా వినాయక చవితి అంటే ఆ క్రేజే వేరు. ఎంతో ప్రత్యేకమైన ఈ పండుగను ఊరూరా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం వినాయకుడిని ఆది దేవుడు అంటారు. ఏ పని మొదలెట్టాలన్నా ముందుగా ఆయన పూజనే చేయడం ఆనవాయితీ. అలాంటి గణపతి పప్పను ప్రతీ ఏడాది వినాయక చవితి నాడు ప్రతిష్టించి గొప్పగా పూజలు చేస్తారు. వాడవాడనా గణేషుడిని ప్రతిష్టిస్తారు.
అయితే ఈ గణేశుడి ప్రతిమలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లాంటి రసాయనాలు వాడటం కారణంగా వాతావరణం కాలుష్యం కావడం, తద్వారా జన జీవనంలో కొన్ని వ్యాధులు ప్రబలడం లాంటివి జరుగుతున్నాయి. అందుకే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లాంటి రసాయనాలు వాడకుండా కేవలం ఒండ్రు మట్టితో చేసిన వినాయకులను ప్రతిష్టించుకోవాలనే కోణంలో పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే చాలా మందిలో అవేర్నెస్ రావడం, మట్టి వినాయక విగ్రహాలనే వాడటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మట్టి వినాయకుణ్ణి తయారు చేస్తూ తనలోని క్రియేటివిటీని బయటపెట్టి తన అభిమానులకు సూపర్ అవేర్నెస్ ఇచ్చింది ఇస్మార్ట్ పాప నభా నటేష్. ఈ రకంగా హీరోయిన్లందరిలో తాను మాత్రం వేరయా! అని ప్రూవ్ చేసుకుంది నభా నటేశ్. ఆమె మట్టి వినాయకుడిని తయారు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











