‘పోకిరి’లో మొదటగా ఆ హీరోయిన్ ఫిక్స్.. అలా జరగడంతో ఇలియానాకు ఛాన్స్.. అసలు కథ ఏంటంటే?

సినిమా ప్రపంచం ఓ వింత ప్రపంచం. ఎప్పుడు ఎవరి దశ ఎలా మారుతుందో చెప్పలేం. ఒకరి కోసం రాసుకున్న పాత్రల్లో మరొకరు వచ్చి చేరుతారు. ఒకరి అదృష్టం మరొకరి చేతుల్లోకి వెళ్తుంది. ఎప్పుడు ఎవరు ఎలా వెలుగులోకి వస్తారో చెప్పడం కష్టం. తారల తలరాతను మార్చడానికి ఒక్క సినిమా చాలు. అది హిట్ అయితే ఒకలా.. ఫ్లాప్ అయితే మరోలా ఉంటుంది వారి స్థితి. అలాంటి ఓ గొప్ప చిత్రాన్ని, కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రాన్ని మిస్ అయితే ఎంతటి బాధ కలుగుతుందో చెప్పలేం. టాలీవుడ్‌లో పోకిరి చిత్రం సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. అలాంటి చిత్రంలో హీరోయిన్‌గా ముందు వేరే హీరోయిన్‌ను ఫిక్స్ చేశారట. కానీ ఇలియానాకే అదృష్టం ఉండటంతో అది ఆమెను వరించిందంటా. ఆ కథేంటోఓ సారి చూద్దాం.

ఇండస్ట్రీ హిట్ పోకిరి..

ఇండస్ట్రీ హిట్ పోకిరి..

టాలీవుడ్‌లో పోకిరి చిత్రానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సపరేట్ ట్రాక్ ఉంటుంది. మహేష్ బాబు, పూరీ జగన్నాద్‌ల కెరీర్‌ను మలుపుతిప్పిన పోకిరి.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ కొల్లగొట్టి దాదాపు నాలుగు రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది.

పద్నాలుగేళ్ల పోకిరి..

పద్నాలుగేళ్ల పోకిరి..

పోకిరి విడుదలై పద్నాలుగేళ్లైన సందర్భంగా పూరి జగన్నాద్ స్పందిస్తూ.. కురిపిస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.. పద్నాలుగేళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతోన్నా.. పోకిరి ప్రేమికులందరికీ చీర్స్ అంటూ ట్వీట్ చేశాడు. పోకిరికి పద్నాలుగేళ్లు అనే విషయం ట్విట్టర్‌లో తెగ ట్రెండ్ అయింది.

ఇలియానా కెరీర్‌కు ప్లస్..

ఇలియానా కెరీర్‌కు ప్లస్..


పోకిరి చిత్రంలో ఇలియానాకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. సినిమాలో కీ రోల్ కావడం, అందంగా చూపించడం, నటనకు ప్రాధాన్యం ఉండటంతో శ్రుతి పాత్ర ఓ రేంజ్‌లో పండింది. ఇలియానాకు రెండో చిత్రమైన పోకిరి ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. అయితే ఈ అవకాశం మొదటగా కంగనా రనౌత్‌కు వచ్చిందంటా.

Recommended Video

Star Heros Special Target On Dussehra Holidays
రెండింటికి సెలెక్ట్ అయ్యాను..

రెండింటికి సెలెక్ట్ అయ్యాను..

పోకిరి విషయం ప్రస్తావించిన కంగనా.. నాటి సంగతులను గుర్తు చేసుకుంది. పోకిరి, గ్యాంగ్ స్టర్ చిత్రాల ఆడిషన్స్‌కు వెళ్లానని రెండింటిలో సెలెక్ట్ అయ్యానని తెలిపింది. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో పోకిరి చిత్రాన్ని వదులుకున్నానని చెప్పుకొచ్చింది. అందుకే పూరి జగన్నాద్ తనకు ఏక్ నిరంజన్ సినిమాలో అవకాశాన్ని ఇచ్చాడని పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X