గాడ్ ఫాదర్‌తో లైగర్ టీమ్: సల్మాన్ ఖాన్, చిరంజీవిని కలిసిన పూరీ, విజయ్ దేవరకొండ.. అసలు కథ ఏమిటంటే?

టాలీవుడ్ సినీ ప్రముఖులంతా ప్రస్తుతం బాలీవుడ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు. ముంబైలో మెగాస్టార్ చిరంజీవి, పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మీ కౌర్ తమ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అలా బీజీగా ఉంటూనే మెగాస్టార్‌ చిరంజీవి, సల్మాన్ ఖాన్‌తో కలిసి లైగర్ మూవీ టీమ్ సందడి చేశారు. బాలీవుడ్‌లో లైగర్, గాడ్ ఫాదర్ సినిమాల హంగామా గురించి వివరాల్లోకి వెళితే..

 లైగర్ ప్రమోషన్స్‌లో విజయ్ దేవరకొండ బిజీ

లైగర్ ప్రమోషన్స్‌లో విజయ్ దేవరకొండ బిజీ


అర్జున్ రెడ్డి మూవీతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకొన్న విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో తొలిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టున్నారు. గత నాలుగైదు రోజులుగా లైగర్ సినిమా ప్రమోషన్స్ ముంబైలో జోష్‌తో కొనసాగుతున్నాయి. లోకల్ ట్రైన్స్, రైల్వేస్టేషన్‌లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే సందడి చేశారు. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ చాలా జోరుగా కొనసాగిస్తున్నారు.

ట్రెండింగ్‌గా లైగర్ పాటలు

ట్రెండింగ్‌గా లైగర్ పాటలు


లైగర్ సినిమాకు సంబంధించిన అకిడి పకిడి పాట, అలాగే వాట్ లాగాదేంగే సాంగ్ రిలీజ్ చేయగా, యూట్యూబ్, సోషల్ మీడియా అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌పై ట్రెండింగ్‌గా మారాయి. లైగర్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీగా బజ్ క్రియేట్ చేసింది. ఇటీవల ముంబైలోని ఓ మాల్‌లో ఈవెంట్ ఆర్గనైజ్ చేయగా.. ఆ కార్యక్రమానికి అభిమానులు, సినీ ప్రేక్షకులు భారీగా పోటెత్తారు. దాంతో ఈ సినిమాపై ఇంకా అంచనాలు పెరిగాయి.

 ముంబైలో గాడ్ ఫాదర్ సాంగ్

ముంబైలో గాడ్ ఫాదర్ సాంగ్


లైగర్ సినిమాను కాసేపు పక్కన పెడితే.. ముంబైలో మరో టాలీవుడ్ సినిమా స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా సాంగ్ షూట్ ముంబైలో జరుగుతుండటంతో నేషనల్ మీడియా ఫోకస్ అంతా ఈ పాటపైనే పెట్టింది. ఈ ఏడాదిలోనే అత్యుత్తమ సాంగ్‌గా అభివర్ణిస్తున్న ఈ పాటలో సల్మాన్ ఖాన్‌తో కలిసి చిరంజీవి స్టెప్పులు వేస్తున్నారు. ఈ పాట కోసం ప్రత్యేకంగా భారీ వ్యయంతో సెట్‌ను వేయడం విశేషంగా మారింది.

గాడ్ ఫాదర్ సెట్‌లోకి లైగర్ టీమ్

గాడ్ ఫాదర్ సెట్‌లోకి లైగర్ టీమ్


బాలీవుడ్‌ను విశేషంగా ఆకర్షిస్తున్న గాడ్ ఫాదర్ సెట్‌ను లైగర్ టీమ్ సందర్శించింది. పూరీ జగన్నాథ్, చార్మీ, విజయ్ దేవరకొండ ముగ్గురు కలిసి సల్మాన్, చిరంజీవితో భేటి అయ్యారు. ఈ సందర్భంగా లైగర్ సినిమా గురించిన ప్రమోషన్ విశేషాలను, అలాగే ఇతర అంశాలను చిరంజీవి, సల్మాన్ ఖాన్‌తో పంచుకొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్‌ను, చిరంజీవిని తమ ప్రీమియర్ షోకు హాజరుకావాలని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం.

లైగర్ మూవీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

లైగర్ మూవీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు


పూరీ కనెక్ట్స్ బ్యానర్‌, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్లోకి వెళితే..

నటీనటులు

నటీనటులు

నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలీ, మక్రంద్ దేశ్ పాండే, గెటప్ సీను తదితరులు
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ భాషా
ఎడిటర్: జునైత్ సిద్దిఖీ
రిలీజ్ డేట్: 2022-08-25

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X