ఆయన కథ చెబుతారేమోనని ఎదురుచూస్తున్నా.. డైరెక్టర్‌పై మహేష్ బాబు కామెంట్స్

మహేష్ బాబు, పూరీ జగన్నాద్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ గురించి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే పోకిరి, బిజినెస్‌మెన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే హ్యాట్రిక్ మూవీ కోసం పూరీ జగన్నాద్ ప్రయత్నించాడని కానీ మహేష్ బాబు మాత్రం ఇంట్రెస్ట్ చూపలేదని అప్పట్లో టాక్ వినిపించింది. అయితే మళ్లీ ఇన్నేళ్లకు పూరీ జగన్నాద్‌పై మహేష్ బాబు కామెంట్ చేశాడు. అసలు ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

 నేడు స్పెషల్ ట్రీట్..

నేడు స్పెషల్ ట్రీట్..

మహేష్ బాబు 27వ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ప్రకటించి అందరినీ ఖుషీ చేశాడు. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన సర్కారు వారి పాట ఓ రేంజ్‌లో వైరల్ అయింది. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి అనేక విషయాలపై స్పందించాడు.

 వ్యక్తిగత విషయాలపైనా..

వ్యక్తిగత విషయాలపైనా..


గౌతమ్, సితారాలో ఎవరెక్కువ ఇష్టమని అడిగితే.. వారిద్దరూ నాకు ఇష్టమేనని ఏ ఒక్కరిని తక్కువ చేయలేనని చెప్పుకొచ్చాడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో ఏం తినాలని అనిపిస్తుందని అడిగితే.. మిర్చి బజ్జీ తినాలని ఉందని రిప్లై ఇచ్చాడు.

ఆయన కథ చెబుతారేమోనని ఎదురుచూస్తున్నా..

ఆయన కథ చెబుతారేమోనని ఎదురుచూస్తున్నా..

‘రాబోయే రోజుల్లో పూరీతో కలిసి సినిమా చేస్తారా? మేం ఎదురుచూస్తున్నాం' అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మహేశ్ సానుకూలంగా సమాధానమిచ్చాడు. పూరీతో తప్పకుండా సినిమా చేసే అవకాశం ఉందని, తన అభిమాన దర్శకుల్లో ఆయన ఒకరని చెప్పాడు. పూరీ వచ్చి కథ చెబుతారేమోనని.. తాను ఇప్పటికీ ఎదురుచూస్తున్నానని మహేశ్ సమాధానమివ్వడం విశేషం.

Recommended Video

Sarkaru Vaari Paata : Mahesh Babu New Look In Sarkaru Vaari Paata | SSMB 27
జనగణమన వస్తుందేమో..

జనగణమన వస్తుందేమో..


మహేశ్, పూరీ కలిసి ‘జనగణమన' చేస్తారని అభిమానులు గతంలోనే ఆశించారు. కారణం ఏదైనప్పటికీ అలా జరగలేదు. ‘ఇస్మార్ట్ శంకర్' ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూరీ కూడా.. తాను హిట్‌ల్లో ఉన్నప్పుడే మహేశ్ తనతో సినిమా చేస్తాడని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి వీరి కాంబోలో జనగణమన వస్తుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X