Mahesh Babu Birthday దుమ్మురేపుతున్న పోకిరి అడ్వాన్స్ బుకింగ్.. ప్రపంచవ్యాప్తంగా మహేష్ మానియా!

సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి అప్పట్లో సంచలనం విజయం సాధించింది. 2006 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన రిలీజైన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది. మహేష్‌బాబు కెరీర్‌లోనే భారీ కలెక్షన్లను సాధించిన చిత్రంగా అప్పట్లో రికార్డును క్రియేట్ చేసింది. అయితే అలాంటి వైబ్రెంట్ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. అయితే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్, థియేటర్ కౌంట్ విషయాల వివరాల్లోకి వెళితే..

మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించి

మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించి


మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9వ తేదీని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా తెలుగు అభిమానులు ఫ్యాన్స్ షోలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాన్స్‌ షోలో ఎంఎస్ రాజు, గుణశేఖర్ రూపొందించిన ఒక్కడు, పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన పోకిరి సినిమాలను ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

పోకిరి, ఒక్కడు ప్రత్యేక షోల ఆదాయంతో

పోకిరి, ఒక్కడు ప్రత్యేక షోల ఆదాయంతో


మహేష్ బాబు బర్త్ డేను పురస్కరించే ప్రత్యేక షో ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉన్నతమైన కార్యక్రమం కోసం ఉపయోగించేందుకు ఫ్యాన్స్ సిద్దమవుతున్నారు. పోకిరి, ఒక్కడు సినిమా ద్వారా వచ్చే కలెక్షన్లను మహేష్‌బాబు స్థాపించిన MB ఫౌండేషన్‌కు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకొన్నారు. MB ఫౌండేషన్ ద్వారా చిన్నారుల గుండె ఆపరేషన్లకు, విద్య సహాయం చేయడానికి ఈ ఆదాయాన్ని వినియోగించేందుకు సిద్దమవుతున్నారు.

 హైదరాబాద్‌లో భారీ స్పందన

హైదరాబాద్‌లో భారీ స్పందన


మహేష్ బాబు ఫ్యాన్స్‌ ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ షోలకు విశేషమైన స్పందన లభిస్తున్నది. అడ్వాన్సు బుకింగ్ ఓపెన్ చేసిన వెంటనే హైదరాబాద్‌తోపాటు నైజాంలోని ప్రధాన పట్టణాల్లో మంచి రెస్సాన్స్ లభిస్తున్నది. ఆంధ్రాలోని పలు పట్టణాల్లో భారీగా స్పందన కనిపిస్తున్నది. మొదటగా 100 షోలు వేయాలని నిర్ణయం తీసుకొంటే.. దాని సంఖ్య 200కు పైగా షోలకు పెరిగింది అనే వార్తలు వెలువడుతున్నాయి.

అమెరికాలో ఫుల్ రెస్సాన్స్

అమెరికాలో ఫుల్ రెస్సాన్స్


అమెరికాలో పోకిరి ఫ్యాన్స్ షోకు భారీ రెస్పాన్స్ లభిస్తున్నది. తాజా అప్‌డేట్‌ ప్రకారం 17 లోకేషన్లలో 24 షోలకు అడ్వాన్సు బుకింగ్ ఓపెన్ చేశారు. ఇప్పటికే 6 షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. 1550 టికెట్లు అమముడుపోయాయి. టెక్సాస్‌లో 5 షోలు 98 శాతం అక్యుపెన్సీ నమోదైంది. దాంతో 6500 అమెరికా డాలర్లు వసూలు చేసింది. పోకిరి సినిమా రీ రిలీజ్‌కు భారీ స్పందన కనిపిస్తున్నది.

డిమాండ్ భారీగా.. అదనపు షోలు

డిమాండ్ భారీగా.. అదనపు షోలు


పోకిరి సినిమాకు హైదరాబాద్‌లో బ్రహ్మండమైన రెస్పాన్స్ కనిపిస్తున్నది. ఇప్పటికే 17 షోలు ఏర్పాటు చేశారు. అభిమానుల డిమాండ్ మేరకు కొన్ని చోట్ల అదనపు షోలను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రదర్శించబోయే పోకిరి ప్రదర్శనలకు 93 శాతం అక్యుపెన్సీ నమోదైంది. సుదర్శన్‌35 థియేటర్‌లో ఆదివారం నుంచి అడ్వాన్స్ బుకింగ్ మొదలవుతుంది. ఫ్యాన్స్ నుంచి భారీ డిమాండ్ ఉండటంతో ఎక్స్ రోడ్‌లో మరో షోను ఏర్పాటు చేస్తున్నారు.

 12 కోట్ల బడ్జెట్‌తో ఎంత వచ్చిందంటే?

12 కోట్ల బడ్జెట్‌తో ఎంత వచ్చిందంటే?


ఇక పోకిరి సినిమా విషయానికి వస్తే. ఇలియానా నటించిన ఈ చిత్రాన్ని 12 కోట్ల బడ్జెట్‌తో రూపొందించింది. అయితే అందరి అంచనాలను మించి ఈ చిత్రం 66 కోట్ల వసూళ్లను సాధించింది. 2006లో పోకిరి ఇండస్ట్రీ రికార్డును నెలకొల్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X