పూరి-మహేష్ కోల్డ్ వార్.. దానికి నిదర్శనమిదే.. సూపర్ స్టార్‌ను లెక్కచేయని డైరెక్టర్

పూరి జగన్నాద్ ఎలాంటాడో ప్రత్యేకంగా విడమరిచి చెప్పనక్కర్లేదు. ఆయన హీరోలను తెరపై చూపించే విధానం, చెప్పించే డైలాగ్‌లు ఆయనకు ప్రతిరూపమే. ఆయనకంటూ ఓ ఇగో, ఆయనకంటూ ఓ వ్యక్తిత్వం, ప్రత్యేకత ఉంటుంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనిపించుకన్న పూరి.. మనసులో ఒకటి బయటకు ఇంకోటి మాట్లాడలేడు.

అందుకే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమయ్యాడు. పూరి జగన్నాద్, మహేష్ బాబు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని అక్కడ ఇక్కడా మాట్లాడుకోవడమే గానీ కచ్చితంగా ఇది అని ఎవ్వరూ చెప్పలేరు. అయితే నేడు పూరి చేసిన ఓ ట్వీట్ మాత్రం ఓ సాక్షంగా నిదర్శనంగా నిలిచింది. అసలు మ్యాటరేంటో ఓ సారి చూద్దాం.

మహేష్ వింత పద్దతి..

మహేష్ వింత పద్దతి..

మహేష్ బాబు ఏ డైరెక్టర్‌కైనా ఛాన్స్ ఇవ్వాలంటే మొదటగా ట్రాక్ రికార్డ్ చూస్తాడని టాక్. హిట్ ఇచ్చిన, ఇస్తున్న డైరెక్టర్లకే అవకాశం ఇస్తాడని గుసగుసలు వినిపిస్తుంటాయి. ఓసారి సరిగ్గా గమనిస్తే అందరికీ అర్థమవుతుందనుకోండి. ఫ్లాప్ దర్శకులను దగ్గరకు కూడా రానివ్వడని ఇన్‌సైడ్ టాక్.

నలిగిపోతోన్న జనగణమన..

నలిగిపోతోన్న జనగణమన..

పోకిరి, బిజినెస్‌మెన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తరువాత హ్యాట్రిక్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే జనగణమన అనే పవర్ఫుల్ టైటిల్‌ను ప్రకటించాడు. మహేష్ బాబుతో సినిమా ఉంటుందని తెలిపాడు. అయితే కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. దానికి కారణం మహేష్ వ్యవహారశైలే కారణమని తెలుస్తోంది.

ఇస్మార్ట్ ప్రమోషన్స్‌లో..

ఇస్మార్ట్ ప్రమోషన్స్‌లో..

'ఇస్మార్ట్ శంకర్' ప్రచారంలో భాగంగా ఒక ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మ‌హేష్‌పై పూరి గట్టిగా సెటైర్ వేశాడు. హిట్టుల్లో ఉంటేనే మహేష్ అవకాశం ఇస్తాడని చెప్పుకొచ్చాడు. మహేష్ అభిమానులకు తనపై నమ్మకం ఉన్నప్పటికీ... మ‌హేష్‌కి లేద‌నీ, అవకాశం ఇవ్వడం లేదని పూరి స్పష్టంగా చెప్పాడు. 'ఇస్మార్ట్ శంకర్' విజయం సాధించింది కనుక ఇప్పుడు మహేష్ మీకు అవకాశం ఇస్తారేమో అని సదరు యాంకర్ అనగా... 'నాకో క్యారెక్టర్ ఉంటుంది కదా. నేను ఓకే అనాలి కదా' అని పూరి చెప్పుకొచ్చాడు. ఈ ఆన్సర్ బట్టి చూస్తే పూరి ఇగో దెబ్బతిందని అర్థమవుతోంది.

మహేష్ సైతం..

మహేష్ బాబు తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రం మహర్షి వేడుకల్లో సుకుమార్, పూరి జగన్నాద్‌ను విస్మరించాడు. అంతకుముందే సుకుమార్‌తో విబేధాలు రావడం, పూరితో కోల్డ్ వార్ నడుస్తుండటంతో కావాలనే ఇద్దరి పేర్లు చెప్పలేదేమోనని అంతా అనుకున్నారు. కానీ తెల్లారి మళ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. వేదికపై చెప్పడం మరిచిపోయాయని చెప్పి ఆ ఇద్దరి గురించి చెప్పాడు.

మహేష్‌ను లెక్కచేయని పూరి..

మహేష్‌ను లెక్కచేయని పూరి..

తాజాగా మరోసారి ఈ కోల్డ్ వార్‌కు సంబంధించిన అంశం బయటకు వచ్చింది. అందుకు కారణం పూరి చేసిన ట్వీటే. నేటికి పోకిరి విడుదలై పద్నాలుగేళ్లు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోకిరి ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో పూరి స్పందిస్తూ.. పోకిరిపై ప్రేమను కురిపిస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.. పద్నాలుగేళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతోన్నా.. పోకిరి ప్రేమికులందరికీ చీర్స్ అంటూ ట్వీట్ చేశాడు. కానీ ఇందులో మహేష్ బాబును ప్రస్థావించకుండా వదిలేశాడు.

Recommended Video

#BeTheRealMan: Sampoornesh Babu's Video Goes Viral
పూరిపై ఫ్యాన్స్ ఫైర్..

పూరిపై ఫ్యాన్స్ ఫైర్..

ఇలా మహేష్ బాబును ట్యాగ్ చేయకపోవడం, పోకిరి లవర్స్ అంటున్నారు కనీసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అని కూడా అనడం లేదు, మహేష్ బాబును ట్యాగ్ చేయండి, బలుపు ఎక్కువ అయింది పూరికి అంటూ ఇష్టమొచ్చినట్టు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X