పార్క్‌లో అలా ఇస్మార్ట్ భామ.. 50 రోజులు దాటింది కానీ ఆ పిచ్చి పోలేదు.. నభా నటేష్ షాక్

'నన్ను దోచుకుందువటే' నటుడు యువ హృదయాలను ఇట్టే దోచేసింది యంగ్ హీరోయిన్ నభా నటేష్. అందాలు ఆరబోయడం, అభినయంలో ఆకట్టుకోవడం రెండింటిలో కూడా టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకున్న ఈ భామ ఇటీవలే ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నటించి కుర్రకారుకు స్పెషల్ కిక్కిచ్చింది.

సినిమానే కాదు.. అందులో కూడా

సినిమానే కాదు.. అందులో కూడా

కేవలం సినిమా ఒక్కటే కాదు.. నెట్టింట కూడా తన హంగానే ఎక్కువే అన్నట్లుగా దూసుకుపోతోంది ఇస్మార్ట్ పాప. ఎప్పటికప్పుడు తన హాట్ పిక్స్ షేర్ చేస్తూ సూపర్ ఫాలోయింగ్ కూడగట్టుకుంటోంది.

పార్క్‌లో సేదతీరుతూ

ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను నెటిజన్ల ముందుంచే నభా నటేష్.. తాజాగా తాను పార్క్‌లో సేదతీరున్న ఓ పిక్ షేర్ చేసింది. ఈ పిక్‌లో గడ్డిపై అలా పడుకొని కొంటె చూపుతో ఆకట్టుకుంటూ కనిపిస్తోంది నభా.

Recommended Video

Nabha Natesh Audition Video For Ismart Shankar || Filmibeat Telugu
రామ్‌తో రొమాన్స్

రామ్‌తో రొమాన్స్

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో ఈ భామ చేసిన రొమాన్స్ క్లాస్, మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించింది. తన అందాల ఆరబోతతో వెండితెరకు కొత్త అందం తీసుకొచ్చింది.

50 రోజులు దాటింది కానీ ఆ పిచ్చి పోలేదు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇస్మార్ట్ శంకర్ సినిమా హవా కొనసాగింది. భారీ కలెక్షన్స్ రాబట్టి హీరో హీరోయిన్ల ఖాతాలో సూపర్ హిట్ పడేసి 50 రోజుల సక్సెస్ జర్నీ పూర్తి చేసింది ఈ సినిమా. దీంతో 50 రోజులు దాటింది కానీ ఇస్మార్ట్ శంకర్ పిచ్చి ఇంకా పోలేదంటూ పోస్ట్ పెట్టింది నభా.

చెంప చెళ్లుమనిపించిన నభా

ఇక నభా నటేష్ ఆడిషన్ తాలూకు ఓ వీడియోను షేర్ చేస్తూ నెట్టింట కాక రేపింది ఛార్మి. ఈ ఆడిషన్ వీడియోలో చెంప చెళ్లుమనిపిస్తూ ఓ రేంజ్ లో హుంగామా చేసింది ఇస్మార్ట్ పిల్ల.

జోష్‌లో నభా నటేష్

జోష్‌లో నభా నటేష్

ఇస్మార్ట్ సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్న నభా నటేష్ ప్రస్తుతం రవితేజ సరసన డిస్కో రాజా సినిమాలో నటిస్తోంది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ మరో హీరోయిన్ గా నటిస్తోంది.

పైకానికి రెక్కలు

పైకానికి రెక్కలు

మరోవైపు తన రెమ్మ్యూనరేషన్‌ని కూడా 30 లక్షల నుంచి 40 లక్షలకు పెంచేసిందట నభా నటేష్. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఒకరిద్దరు నిర్మాతలు నభాని సంప్రదించగా.. అంతిస్తేనే ఓకే లేదంటే కుదరదని నిర్మొహమాటంగా చెప్పేసిందట నభా.

మెగా మేనల్లుడితో రొమాన్స్

మెగా మేనల్లుడితో రొమాన్స్

ఇస్మార్ట్ రూపంలో గ్లామర్ డోస్ పెంచేసి వెండితెర విందు ఇచ్చింది నభా. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ దర్శకనిర్మాత చూపు ఆమెపై పడింది. ఈ నేపథ్యంలోనే నభా నటేష్ తాజాగా మెగా మేనల్లుడితో రొమాన్స్ చేసే ఛాన్స్ పట్టేసిందని తెలుస్తోంది.

తమిళ దర్శకనిర్మాతల చూపు

తమిళ దర్శకనిర్మాతల చూపు

తమిళ దర్శకనిర్మాతల చూపు కూడా ఇస్మార్ట్ భామలపై పడిందట. ఈ నేపథ్యంలో నభా నటేష్ ఓ తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా కన్నడ, తెలుగు ప్రేక్షకులనే పలకరించిన నభా అందాలు ఇకపై తమిళ ఆడియన్స్‌ని కూడా గిలిగింతలు పెట్టనున్నాయని తేలిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X