ఎన్టీఆర్‌కు నారా రోహిత్ స్పెషల్ గిఫ్ట్.. ఆసక్తికరంగా మారిన యంగ్ హీరో సర్‌ప్రైజ్.!
తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకడు. నందమూరి కుటుంబానికి చెందిన హీరోనే అయినప్పటికీ... యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే సమయంలో సింగర్‌గానూ రాణిస్తున్నాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న హీరో కాబట్టి అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. కొన్నేళ్లుగా సూపర్ ఫామ్‌లో ఉన్న తారక్.. వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నారా రోహిత్.. ఎన్టీఆర్ కోసం స్పెషల్ గిప్ట్ రెడీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ వివరాలు మీకోసం.!
ఆదర్శంగా నిలిచిన యంగ్ టైగర్.. కష్టకాలంలో తోడుగా.. ఎన్టీఆర్‌కు నెటిజన్ల హ్యాట్సాఫ్

ఎన్టీఆర్ ఖాతాలో వరుసగా ఐదు హిట్లు
కెరీర్ ఆరంభంలో కొన్ని సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత కొన్నేళ్ల క్రితం వరకూ వరుస పరాజయాలను చవి చూశాడు. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత' వంటి హిట్లతో దూసుకుపోతున్నాడు.

టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌లో..
వరుస విజయాలతో జోరుమీదున్న తారక్... ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో ఎన్టీఆర్.. భీంగా, చెర్రీ.. అల్లూరిగా నటిస్తున్నారు. అలాగే, బాలీవుడ్, హాలీవుడ్ సహా ఇతర ఇండస్ట్రీల నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

పొలిటికల్ ఎంట్రీకి మార్గం సుగుమం
బిగ్గెస్ట్ ప్రాజెక్టు తర్వాత జూనియర్ ఎన్టీఆర్... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. దీనికి ‘అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దీన్ని రాధాకృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీ.. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తుందని ప్రచారం జరుగుతోంది.

మరో పాన్ ఇండియా మూవీలో తారక్
త్రివిక్రమ్ సినిమాతో పాటు ఈ నందమూరి హీరో.. మరో ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపేసినట్లు ఇటీవల ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీన్ని KGF ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తాడని అంటున్నారు. అంతేకాదు, పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాకు రూ. 150 కోట్లు బడ్జెట్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం.

మూడు సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయి
మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని మూడు సర్‌ప్రైజ్‌లు రాబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. వాటిలో... RRRలో తారక్ లుక్ వీడియో ఒకటి కాగా, రెండోది.. త్రివిక్రమ్ మూవీ టైటిల్ పోస్టర్ అంటున్నారు. అలాగే, మూడోది... ప్రశాంత్ నీల్‌తో చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన అని వార్తలు వస్తున్నాయి.

25 మంది ప్రముఖులు.. ఎన్టీఆర్ ఘనత
ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చాలా రోజుల క్రితం నుంచే సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే మే 9న 25 మంది సినీ ప్రముఖులతో ఎన్టీఆర్ బర్త్‌డే కామన్ డీపీని విడుదల చేయించారు. ఇలా ఒక హీరో కోసం ఏకంగా 25 మంది ప్రముఖులు రావడం టాలీవుడ్ చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం.
Recommended Video
ఎన్టీఆర్‌కు నారా రోహిత్ స్పెషల్ గిఫ్ట్
తమ అభిమాన హీరో పుట్టినరోజున ఎన్ని సర్‌ప్రైజ్‌లు వస్తాయో అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే కామన్ డీపీని రిలీజ్ చేసిన యంగ్ హీరో నారా రోహిత్.. ‘తారక్ డీపీని రిలీజ్ చేసినందుకు సంతోషంగా ఉంది. అతడి కోసం నేను ఒక స్పెషల్ గిఫ్ట్ రెడీ చేశా. అదేంటో తెలియాలంటే మే 20 వరకు వేచి ఉండండి' అంటూ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











