నా తొమ్మిదేళ్ల బిడ్డతో డార్లింగ్.. చార్మి క్రేజీ ట్వీట్
ఛార్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. లాక్డౌన్‌లో తన పెట్‌తో కలిసి ఎంత సరదాగా సందడి చేసిందో తెలిసిందే. తన అంత ఎత్తున్న పెట్‌తో ఛార్మీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తన పెట్‌ను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. అది అసలు కుక్కనా? లేదా సింహమా? అనే డౌట్ వస్తుంది. తాజాగా అదే అనుమానాన్ని వ్యక్తంచేశారు. కానీ ఈ సారి ఆ పెట్ వెనకాల ఉన్నది మాత్రం నిజమైన సింహమని కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా ఛార్మీ ఓ ఫోటోను షేర్ చేసింది. నా తొమ్మిదేళ్ల బిడ్డతో డార్లింగ్ అంటూ అదిరిపోయే ఫోటోను ఛార్మీ షేర్ చేసింది. ఈ ఫోటోలో ప్రభాస్ లుక్కును చూసి నెటిజన్లు మాత్రం అదిరే కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఆ పెట్ సింహామా? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అది సింహామో కాదో ఏమో గానీ.. వెనకాల ఉన్నది మాత్రం నిజమైన సింహమని డార్లింగ్‌పై ప్రేమను కురిపిస్తున్నారు.

అయితే తాజాగా ప్రభాస్ ముంబైలోని పూరి కనెక్ట్స్ ఆఫీస్ ఎందుకు వెళ్లాడని కామెంట్లు చేస్తున్నారు. పూరి జగన్నాథ్‌తో ప్రభాస్ సినిమా చేయబోతోన్నాడా? అందుకే కలిశాడా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ ప్రభాస్ ఫ్రెండ్లీగానే కలిశాడని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభాస్ ఫోటో మాత్రం ఫుల్ వైరల్ అవుతోంది. ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉండగా.. పూరి జగన్నాథ్ ఫైటర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











