మానవ శరీరం అంతే భరించగలదు.. కానీ ప్రసవ వేదనలో తల్లి మాత్రం.. పూరి జగన్నాద్ ట్వీట్ వైరల్

సృష్టికి ఆధారమైన అమ్మను పూజించడానికి, కీర్తించడానికి, త్యాగాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రపంచం అంతా కలిసి మాతృదినోత్సవాన్ని సెలెబ్రేట్ చేసుకుంటారు. భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, జీవులు ఏవైనా సరే అమ్మ ప్రేమలో మాత్రం మార్పు ఉండదు. అమ్మ ప్రేమ ముందు ఏది తూలదు. అందుకే ప్రపంచ కవులు, రచయితలందరూ వారి పదసంపత్తితో అమ్మను కీర్తించారు.. కొనియాడారు.

Recommended Video

Allu Arjun's Satire On Fake Collections ?

మన తెలుగు సాహిత్యం, కవులు, రచయితలు, సినిమాలు, పాటలు అమ్మకు అగ్రతాంబూలాన్ని ఇచ్చాయి. అమ్మను కీర్తిస్తూ కొన్ని వేల సంఖ్యలో పాటలున్నాయి. తాజాగా డైరెక్టర్ పూరి జగన్నాద్ ఓ పోస్ట్ చేస్తూ అమ్మ గొప్పదనాన్ని చాటి చెప్పాడు.

అమ్మకు ప్రణవిల్లిన టాలీవుడ్..

అమ్మకు ప్రణవిల్లిన టాలీవుడ్..

నేటి మాతృదినోత్సవాన్ని పురస్కరించుకని ప్రతీ ఒక్క హీరో తమ మాతృమూర్తిని స్మరించుకుంటున్నారు. అమ్మ గొప్పదనాన్ని చెబుతూ.. అమ్మతో ఉన్న మధుర స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, మహేష్ బాబు చేసిన పోస్ట్‌లు తెగ వైరల్ అయ్యాయి.

పూరి జగన్నాద్ పోస్ట్..

పూరి జగన్నాద్ పోస్ట్..

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కూడా తన తల్లిని తలుచుకున్నాడు. చిన్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. మరో పోస్ట్‌లో అమ్మ గొప్పతనాన్ని, ఓ బిడ్డకు జన్మనిచ్చేప్పుడు పడే వేదనను వివరించాడు.

మానవ శరీరం అంతే భరించగలదు..

మానవ శరీరం అంతే భరించగలదు..

‘మనిషి పడే బాధని డెల్స్‌లో కొలుస్తారు.. పంటి నొప్పి పది డెల్స్, ఎవరైనా మనల్ని కత్తితో పొడిస్తే అది ఇరవై, మానవ శరీరం 40 డెల్స్ వరకు భరించగలదని అదే.. ఒక తల్లి తన బిడ్డకి జన్మనిస్తూ పడే ప్రసవ వేదన 57 డెల్స్.. అందుకే నిన్ను నవ మాసాలు మోసి కన్నానురా అని ఏడుస్తారు'అంటూ కదిలించేలా ఎమోషన్ పోస్ట్ చేశారు.

తల్లి సెంటిమెంట్ ప్రధానంగా..

తల్లి సెంటిమెంట్ ప్రధానంగా..

పూరి జగన్నాద్ మొదటి నుంచి తల్లి బిడ్డల ఎమోషన్‌ను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. ఆయన సినిమాల్లో అమ్మ గొప్పదనాన్ని చెప్పే పాటలుంటాయి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, లోఫర్ చిత్రాల్లో ముఖ్యంగా ఆ విధమైన పాటలు కనిపిస్తాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X