Valentine Special : పూరీ జగన్నాథ్ - లావణ్య బ్యూటీఫుల్ లవ్ స్టోరీ.. అది ఆయనకే సాధ్యం!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం ఆయన మార్క్ ను ఎవ్వరూ మరిచిపోలేరు. పూరీ జగన్నాథ్ హీరోల క్యారెక్టరైజేషన్ రాయడంలో మాస్టర్ మైండ్. ఆయనలా రాసేందుకు ఎంతో మంది సినీ రైటర్స్ ప్రయత్నించినా విఫలమయ్యామని వారే ఒప్పుకున్నారు. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ లాంటి వారే పూరీ జగన్నాథ్ ఫొటోను మొబైల్ స్క్రీన్ పై పెట్టుకోవడం చూస్తేనే అర్థమవుతుంది.
ఎలాంటి ఎమోషన్ నైనా తన రైటింగ్ స్కిల్ తో క్షణాల్లోనే రప్పించగల దిట్ట పూరీ జగన్నాథ్. యాక్షన్, హీరో ఎలివేషన్ తో పాటు బ్యూటీఫుల్ లవ్ స్టోరీలనూ చూపిస్తుంటారు. బద్రి నుంచి ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, పోకిరి, దేశముదురు, టెంపర్ తదితర చిత్రాలతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఇదిలా ఉంటే.. పూరీ జగన్నాథ్ రియల్ లైఫ్ స్టోరీ కూడా ఆయన సినిమాల రేంజ్ లోనే ఉంటుంది. పలు సందర్భాల్లో పూరీ జగన్నాథ్ - లావణ్యల ప్రేమ, పెళ్లి గురించి అభిమానులకు తెలియజేసిన విషయం తెలిసిందే.

పూరి జగన్నాథ్ 1996లోనే లావణ్యను పెళ్లి చేసుకున్నారు. అయితే.. లావణ్యను మొదటిసారిగా దూరదర్శన్ కోసం చేసిన షూటింగ్ స్పాట్ లో చూశారంట. చూసిన వెంటనే వెళ్లి ఆయన విజిటింగ్ కార్డు ఇచ్చారంట. ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కు బెస్ట్ ఎగ్జాప్. అయినప్పటికీ.. విజిటింగ్ కార్డు ఇచ్చి మరీ పూరీ జగన్నాథ్ చెప్పిన డైలాగ్ వేరే రేంజ్ లో ఉంటుంది. కార్డు ఇచ్చి 'పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే ఫోన్ చేయు' అని చెప్పారంట. అంతంటి సాహసం కేవలం పూరీ జగన్నాథ్ కు మాత్రమే సాధ్యం.
సినిమాల్లో డేరింగ్ డైలాగ్స్ అంటే ఓకే.. కానీ నిజజీవితంలోనూ ఇలాగే మాట్లాడటం ఆసక్తికకరం. ఆ తర్వాత లావణ్య కొద్దిరోజులకు ఫోన్ చేసిందంట. అప్పటి నుంచి ప్రేమాయణం మొదలైంది. అయితే ఓ సందర్భంలో లావణ్యను పెళ్లి చేసుకోకూడదని కూడా అనుకున్నారంట పూరీ. ఆమెతో పూరీ ఓ హోటల్ కు వెళ్లిన సందర్భంలో ఆమె ఆర్డర్ చేసిన ఫుడ్ ని చూసి మెయింటెన్ చేయగలనా?.. అసలే మనీ స్ట్రగుల్ చూస్తున్న తరుణంలో పెళ్లేందుకు అనే సందేహం కూడా వచ్చిందంట.
ఏదేమైనా పూరీ జగన్నాథ్ - లావణ్య ప్రేమను గెలిచారు. అలాగే ఇంట్లో వాళ్లను కూడా ఒప్పించారు. ఇక్కడా ఓ ట్విస్ట్ ఉందండోయ్... ఇరు కుటుంబాల్లో అంగీకారం వచ్చినా.. గుడిలోనే పెళ్లి చేసుకున్నారీ జంట. ఇందుకు కారణం పూరీ జగన్నాథ్ ఐడియాలజీనే. ఎందుకంటే.. పెళ్లికి అయ్యే ఖర్చు.. హడావుడి అంతా వేస్ట్ అనే భావనలోనే గుడిలో పెళ్లి చేసుకున్నామని పూరీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వీరికి కూతురు, కొడుకు ఆకాష్ ఉన్నారు. ఆకాష్ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక పూరీ చివరిగా 'లైగర్' సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. మూవీ రిజల్ట్ మాత్రం ఆశించిన మేర లేదు. నెక్ట్స్ ఎలా కంబ్యాక్ ఇస్తారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











