నాకు అలాంటి వేధింపులు.. ఇక గుడ్‌బై.. పూరీ జగన్నాథ్ కూతురు షాకింగ్ నిర్ణయం
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర పూరికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ మాటల్లో చెప్పలేం. ఇన్స్‌టాగ్రామ్‌లో పవిత్ర పూరి పెట్టే పోస్టులకు మంచి క్రేజ్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తనకు అనూహ్యంగా ఫాలోయింగ్ ఉన్న ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేయాలని పవిత్ర పూరి నిర్ణయం తీసుకోవడం ఇప్పడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే తాను ఎందుకు ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేయాలనుకొంటున్నారనే విషయంపై క్లారిటీ ఇస్తూ..

ఇన్స్‌టాగ్రామ్‌లో పవిత్ర పూరికి
పవిత్ర పూరికి ఇన్సాటాగ్రామ్‌లో @Pavithra_Puri అకౌంట్ ఉంది. ఆ అకౌంట్‌కు 104K మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆ అకౌంట్ ఉండగానే @PavithraPuri అనే అకౌంట్‌ను ఓపెన్ చేయడం, కొత్త అకౌంట్‌ను ప్రమోట్ చేయడంతో ఆమె ఫాలోవర్స్ ప్రశ్నలను సంధిస్తూ మెసేజ్‌లు పంపుతున్నారు. దాంతో ఆమె తన పాత అకౌంట్ కష్టాలను వెల్లడించారు.

నా పాత అకౌంట్ గురించి చాలా మంది
ఇన్స్‌టాగ్రామ్‌లో రెండు అకౌంట్లు ఉపయోగించడంపై నన్ను చాలా మంది మేసేజ్ చేస్తున్నారు. నా పాత అకౌంట్, కొత్త అకౌంట్ గురించి ఆరా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు నేను క్లారిటీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. నాకు రెండు అకౌంట్లు ఉన్న విషయం నిజమే. కొత్త అకౌంట్ ఓపెన్ చేయడానికి ఓ కారణం ఉంది అని పవిత్ర పూరి తెలిపారు.

చాలా సమస్యలను ఎదుర్కొంటున్నా
ఇన్స్‌టాగ్రామ్‌లోని నా పాత అకౌంట్‌తో నేను చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాను. అందుకే పాత అకౌంట్‌ను డిలీట్ చేయాలని డిసైడ్ అయ్యాను. ప్రస్తుతం కొత్త అకౌంట్‌ను మొదలుపెట్టాను. నా కొత్త అకౌంట్ మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత పాత అకౌంట్‌ను డిలీట్ చేస్తాను అని పవిత్ర పూరి చెప్పారు.

104k ఫాలోవర్స్ ఉన్న అకౌంట్‌ను డిలీట్ చేయడం
ఇన్స్‌టాగ్రామ్‌లో 104K మంది ఫాలోవర్స్ ఉండటమనేది జోక్ కాదు. అలాంటి అకౌంట్ డిలీట్ చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అందుకే దానిని సడెన్‌గా డిలీట్ చేయడం లేదు. కొత్త అకౌంట్‌ను రెఫరెన్స్ ఇస్తూ పోస్టులు పెడుతున్నాను. కొత్త అకౌంట్ అందరికి పరిచయం అయిన తర్వాత రెండో అకౌంట్‌ను క్లోజ్ చేస్తాను అని పవిత్ర పూరి పేర్కొన్నారు.
Recommended Video

నా కొత్త అకౌంట్‌కు షిఫ్ట్ అవ్వండి
ప్రస్తుతం నా పాత అకౌంట్ @Pavithra_Puri తో ప్రాబ్లెం ఉంది. @PavithraPuri అకౌంట్‌ను ఫాలో అవ్వండి. త్వరలోనే పాత అకౌంట్‌ను డిలీట్ చేస్తాను. కాబట్టి మీరంతా నా కొత్త అకౌంట్‌కు షిప్ట్ చేయండి అంటూ పవిత్ర పూరి తన ఫాలోవర్స్‌ను కోరారు.


Click it and Unblock the Notifications











