పూరి జగన్నాథ్ మల్టీస్టారర్ స్టోరీ.. ఆ బడా స్టార్ హీరోలతో అనుకున్నాడు కానీ..
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేశాడని చెప్పవచ్చు. ప్రతి హీరోను తనదైన శైలిలో హై వోల్టేజ్ క్యారెక్టర్ ను ప్రజెంట్ చేసిన పూరి కథలను ఎంత తొందరగా రాస్తాడో అంతే వేగంగా షూటింగ్ పూర్తి చేస్తారు. గతంలో చాలా మంది హీరోలు ఆయన సింగిల్ లైన్ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. అయితే పూరి ఒకసారి ఇద్దరి హీరోలకు అదే తరహాలో ఒక లైన్ వినిపించాడట.

అందుకే ఒప్పుకునేవారు..
దర్శకుడు పూరి జగన్నాథ్ ఒకప్పుడు ఎలాంటి కథ చెప్పినా కూడా హీరోలు చాలా ఈజీగా ఒప్పుకునేవారు. పూరి అంటే అప్పట్లో అంత నమ్మకం ఉండేది. డైలాగ్స్ తో అయినా సినిమాను ఈజీగా 50రోజులు ఆడించేవారు. బాక్సాఫీస్ వద్ద పెద్దగా నష్టాలు వచ్చేవి కావు. పైగా ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేస్తాడని ఒప్పుకునేవారు.

మొదటిసారి మల్టీస్టారర్ ఆలోచన
అసలు మ్యాటర్ లోకి వస్తే గతంలో మల్టీస్టారర్ సినిమాలు అంటేనే భయపడుతున్న తరుణంలో పూరి జగన్నాధ్ ఆ ప్రయోగం చేయడానికి ఎంతగానో ఇంట్రెస్ట్ చూపించాడు. అయితే మొదట అతను చెప్పిన కథకు ఒప్పుకున్న ఏకైక హీరో ప్రభాస్ అని అప్పట్లో టాక్ గట్టిగానే వచ్చింది.

గ్యాంగ్ స్టర్ vs పోలీస్
ఏక్ నిరంజన్ సినిమా అనంతరం పూరికి బాగా క్లోజ్ అయిన ప్రభాస్ ఆ తరువాత మరో సినిమా చేయాలని అనుకున్నాడు. గ్యాంగ్ స్టర్ vs పోలీస్ కాన్సెప్ట్ లోనే ఆ సినిమా కథ రాసుకున్నాడట. ఇక పోలీస్ పాత్ర కోసం గోపిచంద్ ను కూడా అనుకున్నారట. అప్పటికే గోపితో గోలిమార్ అనే సినిమాతో పూరి కమర్షియల్ గా హిట్ కొట్టాడు.

అనుకోకుండా క్యాన్సిల్
అయితే ఎంతో ఇష్టంగా చేయాలని అనుకున్న తరువాత అప్పుడే బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ తో 'బుడ్డా హోగా తెరా బాప్' అనే సినిమా చేయాల్సి వచ్చింది. కానీ ఆ సినిమా అంతగా హిట్టవ్వలేదు. అనంతరం గోపీచంద్, ప్రభాస్ కూడా వేరే సినిమాలతో బిజీ అవ్వడం, ఇక పూరి - మహేష్ బిజినెస్ మెన్ తొందరగా సెట్స్ పైకి రావడం వల్ల ఆ కాంబో అనుకోకుండా క్యాన్సిల్ అయ్యిందట.


Click it and Unblock the Notifications











