పూరి బర్త్ డేకు విష్ చేయడం మరిచింది.. పైగా భలే కవర్ చేసేసింది.. రమ్యకృష్ణ తెలివితేటలు!!
మామూలుగా మనం ఎవరి బర్త్ డేను అయినా మరిచిపోయినా గుర్తు లేకపోయినా ఆ మరునాడు తెలిసినా ఏం చేస్తాం. అయ్యో సారి మరిచిపోయాయి.. బిలేటెడ్ హ్యాపీ బర్త్ డే చెప్పి సైడ్ అయిపోతాం. ఇదంతా సాదారణ జనాలు చేసే పని. శివగామి లాంటి రాజమాత చేసే పని కాదు. తాజాగా రమ్యకృష్ణ పూరి జగన్నాథ్ బర్త్ డే (సెప్టెంబర్ 28)ను మరిచిపోయినట్టుంది. నిన్న చేయాల్సిన పోస్ట్ నేడు (సెప్టెంబర్ 29) చేసింది. అందులోనూ భలే కవర్ చేస్తూ తెలివిగా తప్పించుకుంది.

పూరి బర్త్ డే వైరల్..
పూరి జగన్నాథ్ బర్త్ డే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దాదాపు టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ పూరిని విష్ చేశారు. హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, ప్రముఖ నిర్మాణ సంస్థలు ఇలా అందరూ పూరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అన్నింటి కంటే మరీ ముఖ్యంగా మహేష్ బాబు విష్ చేయడం పూరికి సంతోషం కలిగించిందట.

సోషల్ మీడియాలో యాక్టివ్..
మామూలుగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది రమ్యకృష్ణ. ఈ లాక్ డౌన్ కాలంలో రమ్యకృష్ణ తన పాత ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేసింది. సీమంతం నాటి ఫోటోలు షేర్ చేయగా అవి తెగ వైరల్ అయ్యాయి. అయితే అంత యాక్టివ్‌గా ఉండే రమ్యకృష్ణకు పూరి బర్త్ డే అని గుర్తుకు రాలేదేమో.

తాజాగా వరుసగా పోస్ట్‌లు..
రమ్యకృష్ణ తాజాగా పోస్ట్‌లు చేసింది. నేడు కుష్భూ బర్త్ డే. ఈ మేరకు కుష్బూకు రమ్యకృష్ణ విషెస్ తెలిపింది. ఈ రోజు నీది ఎంజాయ్ చేయ్. సెలెబ్రేట్ చేసుకో. నీ చుట్టు పక్కల ఉన్నవారితో సరదాగా గడుపు.. నీకు ఎలా అనిపిస్తే అలా ఉండు అంటూ రమ్యకృష్ణ పోస్ట్ చేసింది. ఆ వెంటనే మరో పోస్ట్ చేసింది.
Recommended Video

అందుకే చేయలేదు..
కుష్బూకు విషెస్ చెప్పిన తరువాత పూరి జగన్నాథ్ బర్త్ డే అని గుర్తుకు వచ్చిందో ఏమో గానీ ఓ పోస్ట్ చేసింది. నీ బర్త్ డేను నేను మరిచిపోలేదు.. అందరి విషెస్ ఒకే రోజు వస్తే ఏం బాగుంటుంది.. అందుకే నేను ఈ రోజు చేశాను. నేను చూసిన, నాకు తెలిసిన వారిలో మంచి, నిజాయితీ గల వ్యక్తి పూరి జగన్నాథ్‌కు బిలేటెడ్ హ్యాపీ బర్త్ డే అని నైస్‌గా కవర్ చేసింది. ప్రస్తుతం రమ్యకృష్ణ ఫైటర్ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తోందన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











