అది మర్యాద కాదు.. పవన్ కల్యాణ్‌తో ఆ విషయం చెప్పా: రేణు దేశాయ్

By Manoj

సినీ రంగంలో లవ్ ట్రాక్‌లు, ఎఫైర్స్ ఎక్కువగా కనిపిస్తాయన్న టాక్ ఉంది. అందుకు తగ్గట్లే అప్పుడప్పుడూ అలాంటి ఏదో ఒక న్యూస్ బయటకు వస్తుంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఆ తరహా కహానీలు చాలానే కనిపించాయి.. వినిపించాయి. అందులో పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్ ప్రేమాయణం ఒకటి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం.. విడిపోవడం కూడా జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో విడాకుల తర్వాత తొలిసారి పవన్ ఫొటోను షేర్ చేశారు రేణు. వివరాల్లోకి వెళ్తే...

పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్ కలిసింది అప్పుడే

పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్ కలిసింది అప్పుడే


రేణు దేశాయ్ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో బిజీగా ఉన్నారు. పుణెకు చెందిన ఆమెను డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన తొలి సినిమా ‘బద్రీ' కోసం తీసుకున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఆ సినిమా సమయంలోనే పవన్ - రేణు మధ్య ప్రేమ చిగురించిన విషయం తెలిసిందే.

సుదీర్ఘమైన డేటింగ్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు

సుదీర్ఘమైన డేటింగ్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు

‘బద్రీ' సినిమా 2000 సంవత్సరంలో విడుదలైంది. అప్పటి నుంచి దాదాపు తొమ్మిదేళ్ల పాటు పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్ డేటింగ్ కొనసాగించారు. అంతేకాదు, ఆ సమయంలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఈ జంట దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. ఇక, 2009లో ఈ జంట పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీళ్లకు మరో పాప జన్మించింది.

పెళ్లైన రెండేళ్లకే విడాకులు.. సొంతూరికి రేణు

పెళ్లైన రెండేళ్లకే విడాకులు.. సొంతూరికి రేణు

పెళ్లైన తర్వాత కేవలం రెండేళ్లు మాత్రమే కలిసున్నారు పవన్ కల్యాణ్.. రేణు దేశాయ్. ఆ తర్వాత న్యాయబద్ధంగా వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. దీంతో పిల్లలతో కలిసి రేణు తన సొంత ఊరైన పుణె వెళ్లిపోయారు. ఇప్పుడు కూడా ఆమె అక్కడే నివసిస్తున్నారు. పవన్ కల్యాణ్ మాత్రం రష్యన్‌ను వివాహమాడాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.

రెండో పెళ్లికి సిద్ధం.. పవన్‌పై రేణు నో కామెంట్

రెండో పెళ్లికి సిద్ధం.. పవన్‌పై రేణు నో కామెంట్


పవన్‌ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ ఎప్పుడూ తన మాజీ భర్తపై విమర్శలు చేయలేదు. అంతేకాదు, విడాకులకు గల కారణాలను కూడా వెల్లడించలేదు. ఆ సమయంలోనే ఆమె రెండో పెళ్లికి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు.

విడిపోయాక తొలిసారి పవన్‌ కల్యాణ్ ఫొటో పోస్ట్

విడిపోయాక తొలిసారి పవన్‌ కల్యాణ్ ఫొటో పోస్ట్

విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ తొలిసారి పవన్ కల్యాణ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘బద్రీ' సోమవారంతో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అప్పటి షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఓ ఫొటోను ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో పవన్ కూర్చుని ఉండగా.. ఆమె నిల్చుని కనిపించారు.

అది మర్యాద కాదని కల్యాణ్ గారితో చెప్పా


ఈ ఫొటో వెనుక ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘మేము కొండ ప్రాంతంలో షూట్ చేస్తున్నాం. అక్కడ కుర్చీలు లేవు. దీంతో రాళ్ల మీద కూర్చోవాల్సి వచ్చింది. నేను స్కర్ట్ వేసుకోవడం వల్ల కూర్చోలేకపోయాను. కల్యాణ్ గారు మాత్రం కూర్చున్నారు. అమ్మాయి నిల్చుని ఉండగా.. అబ్బాయిలు కూర్చోవడం మర్యాద కాదని అప్పుడు కల్యాణ్ గారితో అన్నాను' అని చెప్పుకొచ్చారు.

Recommended Video

Pawan Kalyan Costly Gift To His Kids | Filmibeat Telugu
పవన్‌తో మళ్లీ కలుస్తుందా..? క్లారిటీ ఇచ్చింది

పవన్‌తో మళ్లీ కలుస్తుందా..? క్లారిటీ ఇచ్చింది


రేణు దేశాయ్ తెలుగులో రెండు సినిమాల్లో మాత్రమే నటించింది. అవి కూడా పవన్ నటించిన ‘బద్రీ', ‘జానీ'నే. విడాకుల తర్వాత మాత్రం ఆమె ‘ఇష్క్ వాలా లవ్' అనే మరాఠి మూవీతో నిర్మాత కమ్ దర్శకురాలిగా మారింది. ఈ నేపథ్యంలో తెలుగులోనూ నటిస్తుందని అన్నారు. మరీ ముఖ్యంగా పవన్ ‘వకీల్ సాబ్'లో చేస్తుందని ప్రచారం జరగగా.. ఆమె ఆ వార్తలను ఖండించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X