ఎద అందాలతో ఎర.. హీటెక్కిస్తున్న రొమాంటిక్ హీరోయిన్
టాలీవుడ్‌లో ఫేమస్ అయి.. పక్క భాషలకు వెళ్తుంటారు భామలు. మన తెలుగులో ఇప్పటి వరకు మెరిసిన, మెరుస్తున్న హీరోయిన్‌లు ఎక్కువగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చినవారే. అలా ఇక్కడికి వస్తారు.. క్రేజ్‌ను తెచ్చుకుంటారు..మళ్లీ బాలీవుడ్‌కో లేదా ఇంకో వుడ్‌కో చెక్కేస్తారు.

ఎక్కువగా కేరళ, కర్ణాటక నుంచి..
మన దగ్గర ఎక్కువగా పాపులర్ అవుతున్నహీరోయిన్లలో ప్రస్తుతం మలయాళ, కన్నడ భామల హవా ఎక్కువగా ఉంది. కన్నడ నుంచి రష్మీక,నభా, శ్రద్దా శ్రీనాథ్ లాంటి వారు దూసుకుపోతుండగా.. మలయాళం నుంచి నిత్యా మీనన్, అనుపమాలాంటి హీరోయిన్‌లు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

తమిళం నుంచి తెలుగు.. తెలుగు నుంచి తమిళంలోకి
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు, కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు హీరోయిన్ల జర్నీ సాగుతూ ఉంటుంది. తెలుగు అమ్మాయిలైన అంజలి, ఐశ్వర్యారాజేశ్ లాంటి వారు తమిళంలో హవా చాటుతుండగా.. అక్కడి నుంచి వచ్చిన సాయి పల్లవి, కీర్తీ సురేశ్ లాంటి వారు ఇక్కడ గట్టి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నారు.

నార్త్ నుంచి వలసలు ఎక్కువ...
ఉత్తర భారతదేశం నుంచి హీరోయిన్స్ ఎక్కవగా దిగుమతి అవుతుంటారు. అందులో ముఖ్యంగా పంజాబ్, ఢిల్లీ ప్రాంతాలకు చెందినవారే ఉంటారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, తాప్సీ లాంటి స్టార్ హీరోయిన్స్ ముందుగా తెలుగులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుని.. బాలీవుడ్ వైపు పరుగులు తీశారు.

కేతికా అనే మరో సంచలనం..
ఢిల్లీకి చెందిన భామ.. కేతికా శర్మ రొమాంటిక్ అనే చిత్రంతో పరిచయం కానుంది. అయితే ఇంత వరకు నేరుగా ఎలాంటి పోస్టర్‌ను విడుదల చేయకపోయినా.. మొన్నామధ్య విడుదల చేసిన పోస్టర్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. హాఫ్ న్యూడ్‌గా ఉన్నకేతికాను బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తూ.. హీరో అయిన ఆకాష్ గట్టిగా హత్తుకున్న పోస్టర్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

ఎద అందాలతో ఎర..
ఢిల్లీకి చెందిన ఈ మోడల్‌కు నెటిజన్లను ఏవిధంగా ఆకర్షించాలో బాగానే తెలిసినట్టుంది. సోషల్ మీడియాలో కొన్ని పిక్స్‌ను పోస్ట్ చేసిన ఈ హీరోయిన్.. తన అందాలను ఎరగా వేసింది. దీంతో కేతికా సొంపులకు కుర్రకారుకు పిచ్చెక్కిపోతోంది. ఈ అమ్మడును వెండితెరపై చూసేందుకు ఆత్రుతగా ఉన్నామంటూ.. తెలుగు సినిమాలో మరింతగా మెరుస్తుందని కామెంట్లు పెడుతున్నారు.

పూరి శిష్యుడు తెరకెక్కిస్తున్న చిత్రం...
ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న రొమాంటిక్ చిత్రాన్ని అనిల్ పాడూరి తెరకెక్కిస్తున్నారు. పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











