పూరి జగన్నాథ్ హిట్టు సినిమా.. 15ఏళ్ళ క్రితం అలా ఛాన్స్ మిస్ చేసుకున్న సుమంత్!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మేకింగ్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆయన ఎలాంటి హీరోతో వర్క్ చేసినా కూడా తన స్టైల్ లో మాస్ పాత్రలో ప్రజెంట్ చేయగలడు. రామ్ లో కూడా ఊరమాస్ క్యారెక్టర్ ఉన్నాడని ఇస్మార్ట్ శంకర్ తో నిరూపించారు. అయితే ఒకనోక సమయంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన మాస్ సినిమా కోసం ఒక క్లాస్ హీరోను అనుకోగా దాన్ని అతను రిజెక్ట్ చేశాడట. ఆ హీరో మరెవరో కాదు. అక్కినేని మేనల్లుడు సుమంత్. ఆ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమంత్ బయటపెట్టాడు.

మొదట్లో ఆఫర్స్ చాలానే వచ్చాయి

మొదట్లో ఆఫర్స్ చాలానే వచ్చాయి

సుమంత్ కెరీర్ మొదట్లో చాలా హడావుడిగానే మొదలైంది. ఎందుకంటే అక్కినేని లాంటి ఫ్యామిలీ నుంచి నాగార్జున వచ్చిన చాలా కాలం తరువాత వచ్చిన హీరో సుమంత్. మొదట్లో అతను ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు అనగానే ఆఫర్స్ చాలానే వచ్చాయి. మొదట రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రేమ కథ అనే సినిమా చేశాడు గాని అది డిజాస్టర్ గా నికిచింది.

పూరి జగన్నాథ్.. ఆఫర్ ఇస్తే..

పూరి జగన్నాథ్.. ఆఫర్ ఇస్తే..

ఇక ఆ తరువాత సుమంత్ హిట్స్ ప్లాప్స్ అని తేడా లేకుండా చాలా సినిమాలు చేశాడు. కానీ ఏ సినిమా కూడా సుమంత్ కెరీర్ కు పెద్దగా యూ టర్న్ ఇవ్వలేదు. ఒకసారి 2008లో ఒక మంచి ఆఫర్ ను సుమంత్ మిస్ చేసుకున్నాడట. అది కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయాల్సిందట. కానీ ఆ కథ సెట్టవ్వదని రిజెక్ట్ చేయడంతో పూరి మరొక హీరోతో ఫినిష్ చేసి హిట్టు కొట్టాడు.

దేశముదురు ఆఫర్ వచ్చినప్పుడు

దేశముదురు ఆఫర్ వచ్చినప్పుడు

పూరి జగన్నాథ్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిన సినిమాల్లో దేశముదురు ఒకటి. ఆ సినిమా ఇప్పటికి టీవీల్లో లో వచ్చినా కూడా భారీ స్థాయిలో రేటింగ్ అందుకుంటుంది. అలాగే హీరో అల్లు అర్జున్ కెరీర్ ను కూడా ఒక్కసారిగా మలువు తిప్పింది. అదే సినిమా కథను మొదట సుమంత్ కు చెప్పాడట పూరి జగన్నాథ్. కానీ సుమంత్ ఆ కథను ఒకే చేయలేదట.

ఎందుకు చేయలేదంటే..

ఎందుకు చేయలేదంటే..

ఇటీవల కపటదారి సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సుమంత్ ఆ సినిమా చేయకపోవడానికి గల కారణాన్ని చెప్పాడు. దేశముదురు కథ విన్నప్పుడు అద్భుతంగా అనిపించిందని అయితే తన బాడీ లాంగ్వేజ్ కు ఏ మాత్రం సెట్టవ్వదని రిజెక్ట్ చేసినట్లు చెప్పాడు సుమంత్. నిజానికి బన్నీ చేసిన తరువాత ఆ సినిమా మరొకరికి సెట్టవ్వదేమో అనిపిస్తుంటుంది. కానీ పూరి ఎలాంటి హీరోను అయినా తనదైన శైలిలో ప్రజెంట్ చెయగలడని చాలాసార్లు నిరూపించాడు. బహుశా ఆ సినిమా సుమంత్ చేసి ఉంటే మరోలా హిట్టయ్యేదేమో అనే కామెంట్స్ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X