Jana Nayagan జన నాయగన్ కోసం సిబ్బందికి సెలవు ప్రకటించిన సంస్థ.. విజయ్ కోసం అధికారికంగా హాలీడే!
దక్షిణాదిలో అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే, అభిమానులకు పండుగను మించి వాతావరణం ఉంటుందనేది పలు సందర్భాల్లో రుజువైన విషయం తెలిసిందే. ముఖ్యంగా రజనీకాంత్, పవన్ కల్యాణ్, చిరంజీవి, మోహన్ లాల్ లాంటి హీరోల మూవీస్ రిలీజ్ అవుతుంటే.. ఆయన అభిమానించే వారు, సాధారణ సినిమా ప్రేక్షకులు వాలంటరీగా లీవ్ పెట్టి థియేటర్లకు వెళ్లడం కొత్తేమీ కాదు. గతంలో కబాలీ, కాలా లాంటి సినిమాలు రిలీజ్ అయిన సందర్బాల్లో కొన్ని సంస్థలు తమ సిబ్బంది కోసం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా విజయ్ నటించిన జన నాయగన్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్, తమిళనాడు ప్రజలందరూ ఆ సినిమాను చూడటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా సెలవు దినాన్ని ప్రకటిస్తున్నాయి. విజయ్ సినిమాను ఎలాంటి ఆటంకం లేకుండా చూడటానికి తమ సిబ్బందికి సెలవు ప్రకటించిన విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జన నాయగన్ కోసం సెలవు ప్రకటించినట్టు విడుదల చేసిన లెటర్ వైరల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

జన నాయగన్ సినిమాకు సింగపూర్‌లోని తమిళుల సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పైరసీ గురై విడుదలకు ముందే సోషల్ మీడియాలో లీక్ కావడం సంచలనంగా మారింది. అయినా ఈ సినిమాను థియేటర్లలోనే చూసేందుకు విజయ్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా తమ అభిమాన హీరో సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అలాగే ఆయన కెరీర్‌లో చివరి చిత్రంగా రాబోతున్న తరుణంలో బిగ్ స్క్రీన్‌పై ఆయనను చూసేందుకు ముచ్చటపడుతున్నారు.
విజయ్‌పై ఇలాంటి ఆసక్తిని గమనించిన ఓ సంస్థ అధికారికంగా తమ సిబ్బందికి సగం రోజు సెలవు ప్రకటించింది. ఏఏజే గ్రూప్స్ పీటీఈ లిమిటెడ్ అనే సంస్థ సింగపూర్‌లో వ్యాపార కలాపాలు కొనసాగిస్తున్నది. తమ సిబ్బంది కోసం ఈ సంస్థ సెలవు ప్రకటిస్తూ.. గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) తన కెరీర్‌లో చివరి చిత్రంగా నటించిన జన నాయగన్ సినిమా 23 జూలై, 2026 రోజున రిలీజ్ అవుతున్నది. ఈ అరుదైన ఈవెంట్ సందర్బంగా, జన నాయగన్ సినిమా చూసేందుకు వీలుగా ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఆఫీస్‌కు మూసి వేయబడుతుంది. ఆ తర్వాత 12 గంటల నుంచి యధావిధిగా సంస్థలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతాయి అని అధికారికంగా లెటర్ రిలీజ్ చేసింది. ఈ లెటర్‌ను విజయ్ అభిమానులు షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
ఈ సినిమాను కన్నడ భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రను పోషించారు. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సినిమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం పైరసీ గురవ్వడమే కాకుండా, 7 నెలలపాటు సెన్సార్‌తో పోరాటం చేసిన తర్వాత జూలై 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది.


Click it and Unblock the Notifications

