'రోలెక్స్' కు సూర్య ఫస్ట్ ఛాయిస్ కాదా?.. అసలు నిజం బయటపెట్టిన కమల్ హాసన్!

లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) గురించి మాట్లాడినప్పుడు అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చేది సినమా'విక్రమ్'. ఈ సినిమాలోని 'రోలెక్స్'పాత్రే చాలా ఇన్ఫ్యాక్ట్ క్రియేట్ చేసింది.కేవలం కొన్ని నిమిషాలే తెరపై కనిపించినా, స్టార్ హీరో సూర్య తన ఇంటెన్స్ లుక్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో హైలెట్ గా మార్చేశారు. ఆ పాత్రను ఒక బ్రాండ్‌గా మార్చేశారు. సినిమా ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకున్న అంశం 'రోలెక్స్' ఎంట్రీనే. అందుకే ఇప్పుడు ఆ పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని కమల్ హాసన్ బయటపెట్టారు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి ఈ క్యారెక్టర్ హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'రోలెక్స్' పాత్ర కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్ మొదట సూర్యను కాదు, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను అనుకున్నారట. కమల్ హాసన్ స్వయంగా అమితాబ్ బచ్చన్‌తో ఈ పాత్ర గురించి చర్చించినట్లు తెలిపారు. అయితే ఈ సమయంలో ఒక ఇంపార్టెంట్ కండీషన్ పెట్టారంట. రోలెక్స్ పాత్రలో నటిస్తే డైలాగులు తమిళంలోనే చెప్పాలని కమల్ కోరారట. కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాకపోవడంతో ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు. ఆ తర్వాతే ఈ పాత్ర సూర్య వద్దకు వెళ్లిందట.

Kamal Haasan Reveals Why Amitabh Bachchan Missed Vikram s Rolex Role and Suriya Took Over

సూర్య ఎందుకు పర్ఫెక్ట్ ఛాయిస్ అయ్యాడు?
రోలెక్స్ పాత్ర నిడివి పరంగా చిన్నదే అయినా, కథపై చూపిన ప్రభావం మాత్రం చాలా పెద్దది. లోకేష్ కనగరాజ్ రూపొందించిన యూనివర్స్‌లో భవిష్యత్తు సినిమాలకు ఈ రోల్ బేస్ స్టోన్ లాంటింది. అలాంటి పాత్రకు అవసరమైన బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్‌ను సూర్య అద్భుతంగా చూపించారు. ఒక్క చూపుతోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించి, క్లైమాక్స్ లో కనిపించేది కొన్ని నిమిషాల్లోనే అయినా.. ఆ పాత్ర సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. రియల్ గా సూర్య నటన అద్భుతం. ఆ పాత్రకు సూర్య ప్రాణం పోశాడనే చెప్పాలి

అలా రాయకండి.. త్వరలో నిజం చెబుతా .. రంగస్థలం మహేష్ ఎమోషనల్ వీడియో! .

అమితాబ్ చేసి ఉంటే ఎలా ఉండేది?
కమల్ హాసన్ ఈ సీక్రెట్ రిలీవ్ చేసిన తరువాత సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఒకవేళ అమితాబ్ బచ్చన్ ఈ పాత్ర చేసి ఉంటే ఎలా ఉండేది. అమితాబ్ తనదైన గంభీరమైన నటనతో పాత్రకు మరో లెవెల్ కు తీసుకెళ్లేవారని అభిప్రాయపడుతుంటే, మరికొందరు మాత్రం సూర్య చూపించిన రఫ్ అండ్ రూత్‌లెస్ లుక్, ఎనర్జీని మరెవరూ అందుకోలేరని అంటున్నారు. మొత్తానికి 'రోలెక్స్ అంటే సూర్య' అనే బలమైన ముద్రపడిందని కామెంట్లు చేస్తున్నారు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ..విక్రమ్ 2', 'ఖైదీ 2'తో పాటు 'రోలెక్స్' పాత్రపై ప్రత్యేక సినిమా కూడా రూపొందించే ఆలోచన ఉందని చెప్పారు. ఆ సినిమా ద్వారా రోలెక్స్ ఎలా ఎదిగాడు? అతని సామ్రాజ్యం ఎలా ఏర్పడింది? అనే అంశాలను చూపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో సూర్య పూర్తి స్థాయి నెగెటివ్ పాత్రలో కనిపిస్తే మోస్ట్ గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచే అవకాశముందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X