పడక గదిలోకి వెళ్లందే ఆఫర్లు రావు.. టాప్ సింగర్‌పై మండిపడ్డ నటి కస్తూరి

సినిమా ఇండస్ట్రీలో తరచుగా చర్చకు వచ్చే టాపిక్ ఏంటంటే మీటూ. చిన్మయి లాంటి ఎంతోమంది ప్రముఖులు మీడియా ముందుకు వచ్చి ఇండస్ట్రీలో తమకు ఎదురైన భయంకరమైన అనుభవాలను మీటూ పేరుతో బయట పెట్టారు. అయితే చిన్మయి మాత్రం ఏకంగా వైరాముత్తు అనే తమిళ ప్రముఖ నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ డైరెక్ట్ గా మీడియాకు ఎక్కింది. తాజాగా ఈ విషయంపై కన్నడ నటి కస్తూరి శంకర్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చిన్మయి గురించి కస్తూరి చెప్పిన నిజాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కన్నడ సీనియర్ హీరోయిన్ కస్తూరి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఆమె తెలుగులో నాగార్జున సరసన అన్నమయ్య సినిమాలో నటించింది. అలాగే మరెన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. పెళ్లి తరువాత కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చి, రీఎంట్రీ తర్వాత సీరియల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

Kannada actress kasthuri shankar sensational comments on chinmayi and Malayalam industry over Me Too issue

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మీటూ గురించి ప్రస్తావనకు రాగా అది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఎక్కడైనా ఉండేదే అని గుర్తు చేసింది. అంతేకాదు తనకు కూడా ఇండస్ట్రీలో అలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయని, కానీ తాను ఎవ్వరి పేరుని బయట పెట్టలేదని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో చిన్మయి సూటిగా వైరాముత్తుపై ఆరోపణలు చేసిందని, అలా చేయాలంటే ధైర్యం ఉండడంతో పాటు ఆధారాలు కూడా ఉండాలని అన్నది ఈ కన్నడ చిన్నది.

అయితే తనకు వైరాముత్తు బాగా తెలుసు అని, ఆయన తనను ఎన్నో విషయాల్లో సపోర్ట్ చేశారని గుర్తు చేసుకుంది. మరోవైపు చిన్మయి కూడా దాదాపుగా 20 ఏళ్ల నుంచి తెలుసని, ఆమె చిన్న వయసులో జరిగిన సంఘటనలను ఏమైనా తప్పుగా తీసుకుని ఉండొచ్చని అభిప్రాయపడింది కస్తూరి. అయితే పర్సనల్ గా చిన్మయి ఒక అద్భుతమైన అమ్మాయిని పొగడ్తల వర్షం కురిపించింది.

కానీ ఎవరిపైన అయినా ఆరోపణలు చేయాలంటే మన దగ్గర సాక్ష్యాలు ఉండాలని, అవి లేనప్పుడు అలా చేయడం వల్ల ఉపయోగం లేదని చెప్పుకొచ్చింది. ఇలాంటి అమెరికా లాంటి కంట్రీలో అయితే ఒకరికి ఒకరు సపోర్ట్ గా ఉంటారని తెలిపింది. కానీ ఇక్కడ మాత్రం అలా జరగదని, ఖచ్చితంగా సాక్ష్యాలు ఉంటేనే కామెంట్స్ చేయగలమని వెల్లడించింది కస్తూరి.

Kannada actress kasthuri shankar sensational comments on chinmayi and Malayalam industry over Me Too issue
ప్రభాస్‌ను తెగ వాడేస్తున్న వేణు స్వామి భార్య.. టాప్ జ్యోతిష్కుడు భలే ఫ్లాన్ వేశాడుగా?

ఇక సినిమా ఇండస్ట్రీలో తనకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని, ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఎదురయిందని గుర్తు చేసుకుంది. ఓ బిగ్ ప్రాజెక్టులో హీరోయిన్ గా తీసుకున్నారని, ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ అవకాశాన్ని లాగేసుకున్నారని చెప్పుకొచ్చింది.

మలయాళ ఇండస్ట్రీ అప్పుడు ఇప్పుడు అద్భుతంగానే ఉందని, కానీ కొంతమంది మాత్రం ఇలాంటి బ్యాడ్ పర్సన్స్ ఎక్కడైనా ఉంటారని కస్తూరి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనగా మారాయి. సినిమా పేరును బయట పెట్టలేదు కానీ బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు అంటూ మలయాళ ఇండస్ట్రీలో అవకాశాల విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని కస్తూరి బయట పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X