విజయ్ సేతుపతి పరువు తీసిన కొడుకు.. క్షమాపణలు చెప్పిన కోలీవుడ్ స్టార్.. ఏమైంది?
కోలీవుడ్ స్టార్ హీర్ విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సింప్లిసిటీ, నటన, వ్యక్తిత్వంతో సాధారణ నటుడి నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు. తమిళంలో నటుడిగా కెరీయర్ ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. ఒకప్పుడు సపోర్టింగ్ పాత్రలతో అలరించి, ఇప్పుడు స్టార్ హీరోగా భారీ ప్రాజెక్ట్ చిత్రాల్లో నటిస్తూ ఉన్నారు. అంతే కాదు ప్రస్తుతం ఆయన కొడుకు సూర్య సేతుపతిని కూడా హీరోగా లాంఛ్ చేశారు. ఇటీవలే అతని తొలిచిత్రం విడుదలైంది. ఈ సందర్బంగా విజయ్ సేతుపతి తనయుడు వివాదంలో చిక్కుకున్నారు. అందుకు తాజాగా స్పందిస్తూ క్షమాపణలు కూడా చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే..
విజయ్ సేతుపతి కొడుకుతో వివాదం..
తమిళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కించుకున్నారు విజయ్ సేతుపతి. దీంతో ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఏర్పడ్డారు. ఆయనతో పాటు అతని పిల్లలను కూడా ఎంతగానో ప్రేమిస్తుంటారు. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి తన కొడుకు సూర్య సేతుపతిని హీరోగా లాంచ్ చేశారు. ఇటీవలనే జూలై 4న సూర్య సేతుపతి నటించిన ఫీనిక్స్ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ లో సూర్య సేతుపతి ఫ్యాన్స్ తో మీట్ అయ్యారు. ఈ సందర్భంగా నోట్లో చూయింగమ్ నములుతూ, చూడటానికి అతి చేస్తున్నట్టుగా కనిపించేలా ప్రవర్తించాడు. దాంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తండ్రి పరువు తీసిన కొడుకు..
సూర్య సేతుపతి తొలి చిత్రం ఫీనిక్స్ విడుదల సమయంలో ఫ్యాన్స్ తో ప్రవర్తించిన తీరు ఏం బాగోలేదని తమిళ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అతని తండ్రి విజయ్ సేతుపతి స్టార్ అయినప్పటికీ ఎంతో ఓర్పుగా, ఫ్యాన్స్ తో మర్యాదగా ప్రవర్తిస్తారు. కానీ సూర్య సేతుపతి మాత్రం కాస్తా బిల్డప్ చూపిస్తున్నారని.. ఇది నెపోటిజంలా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా తండ్రి పరువు తీసేలా ప్రవర్తిస్తున్నాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఈ వివాదం తమిళంలో పెద్దదిగా మారింది. దానిపై తాజాగా విజయ్ సేతుపతి ఇలా స్పందించారు.
క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి..
కొడుకు సూర్య సేతుపతి తన తొలిచిత్రం ఫీనిక్స్ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ ను మీట్ అవ్వడం, ఆ తర్వాత అతని ప్రవర్తనతో ట్రోల్స్ రావడం అన్నీ విజయ్ సేతుపతి దగ్గరకు వెళ్లాయి. దీంతో ఆయన స్పందిస్తూ తన కొడుకు ప్రవర్తన తప్పుగా అనిపిస్తే నేను క్షమాపణలు చెబుతున్నానని తమిళ మీడియా ముందు చెప్పారు. అతను కావాలని చేసి ఉండడని, తెలియకుండా జరిగి ఉంటుందని విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు.
విజయ్ సేతుపతి రాబోయే చిత్రాలు..
తెలుగులో ఇప్పటికే పిజ్జా, ఉప్పెన వంటి చిత్రాలతో విజయ్ సేతుపతి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మాస్టర్, నేనూ రౌడీనే, సింధూ బాయ్, 96, సూపర్ డీలక్స్, విక్రమ్ వంటి చిత్రాలతో దుమ్ములేపారు. ప్రస్తుతం టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం ఇటీవలనే పూర్తి చేసుకుంది.


Click it and Unblock the Notifications











