నయనతారకు షాకిచ్చిన ధనుష్.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు!
తమిళ సినీ పరిశ్రమలో హీరో ధనుష్, హీరోయిన్ నయనతార మధ్య వివాదం మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నయనతారపై వేసిన కాపీరైట్ ఉల్లంఘన కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే ధనుష్ వేసిన కేసును కొట్టివేయాలంటూ నెట్‌ఫ్లిక్స్ వేసిన దావాను కోర్టు తోసిపుచ్చింది. దాంతో నయన్, నెట్‌ఫ్లిక్స్‌కు భారీ షాక్ తగిలినంత పనైందనే మాట తమిళ మీడియాలో వినిపిస్తున్నది. ఈ వివాదం వెనుక అసలు కారణం ఏమిటి? నయనతారపై ధనుష్ ఎందుకు కేసు వేశారు? అనే వివరాల్లోకి వెళితే..
Aarti Agarwal: ఆర్తి అగర్వాల్ మరణానికి కారణమదే.. అమ్మ రాజశేఖర్ నోట షాకింగ్ విషయాలు
కొద్ది రోజుల క్రితం నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డ్యాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది. నయనతార జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, ఆమె నటిగా ఎదిగిన తీరు, ఆమె గురించి సినీ ప్రముఖులు వెల్లడించిన అభిప్రాయాలను డాక్యుమెంటరీగా పొందుపరిచారు. అయితే ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా విఘ్నేష్ శివన్ దర్శకుడిగా రూపొందిన సినిమాకు సంబంధించిన క్లిప్స్‌ను దానిలో వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేశారు.

అయితే తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా సన్నివేశాన్ని వాడుకొంటామని.. అందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్తిస్తూ ఓ లేఖ పంపాం. కానీ రెండు నెలలపాటు ఆ లేఖకు జవాబు కోసం వేచి చూశాం. కానీ ధనుష్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇలా ఆయన వ్యవహరిస్తాడనుకోలేదు అంటూ సుధీర్ఘమైన లేఖను రాస్తూ నయనతార ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే తన అనుమతి లేకుండా తన సినిమాలోని సన్నివేశాన్ని ఎలా వాడుకొంటారు అని నెట్‌ఫ్లిక్స్‌పై అలాగే నయనతారపై ధనుష్ కేసు నమోదు చేశారు. 24 గంటల్లో ఆ 3 నిమిషాల వీడియో క్లిప్‌ను తొలగించాలని లేకపోతే సుమారుగా 10 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తన దావాలో డిమాండ్ చేశారు. అయితే ధనుష్ కేసును కొట్టివేయాలని నెట్ ఫ్లిక్స్ కోర్టును ఆశ్రయించగా.. మద్రాస్ హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పుతో నయనతారకు, నెట్‌ఫ్లిక్స్‌కు ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. ఈ కేసులో ధనుష్ పై చేయి సాధించడం జరిగిందనే సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నానుమ్ రౌడీ ధాన్ అనే సినిమా నయనతారకు ధనుష్‌కు మధ్య వివాదం సృష్టించేలా చేసింది. అయితే ఈ తీర్పు నేపథ్యంలో నయనతార ఎత్తుగడ ఏమై ఉంటుంది. ఆమె ఎలా స్పందిస్తారని అందరూ వేచి చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











