నయనతారకు ఘోర అవమానం.. అందరి ముందే డ్రెస్ మార్చుకోమన్న డైరెక్టర్!

లేడి సూపర్ స్టార్ నయనతార లుక్ అసభ్యకరంగా ఉందంటూ, అందరి ముందే డ్రెస్ మార్చుకోమని ఓ డైరెక్టర్ ఆదేశించారని, దీంతో క్యారవాన్ కూడా అందుబాటులో లేకపోవడంతో నయన్ అందరి ముందే డ్రెస్ ఛేంజ్ చేసుకుందనే వార్త తాజాగా బయటకు వచ్చింది. మరి ఏ మూవీ విషయంలో ఇలా జరిగింది? ఏ డైరెక్టర్ వల్ల నయన్ ఇబ్బంది పడింది ? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

నయనతార చివరిగా అన్నపూర్ణి చిత్రంలో నటించింది. 75వ చిత్రంగా వచ్చిన అన్నపూర్ణి ఆమెకు అపజయాన్ని అందించింది. ఆ తర్వాత మన్నంగట్టి, టెస్ట్ సినిమాలకు నయన్ కమిట్ అయ్యింది. ఆమె ఓ హిందీ సినిమా కూడా చేయనున్నట్టు సమాచారం. జవాన్‌లో ఆమె నటనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నయన్ నెక్స్ట్ హిందీ మూవీ ఏంటి అనే ఆసక్తి నెలకొంది.

Nayanthara faces challenges in Ghajini Movie Sets

సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్నమైన నటిగా నయనతార మరింత పాపులర్ అయ్యింది. ఆ సమయంలోనే అభిమానులు ఆమెకు లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును ఇచ్చారు. నామ్ రౌడీతాన్‌లో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్, నయన్‌లు ప్రేమించి తరువాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా నయన్ సినిమాలు చేస్తూ మరోవైపు ఫామిలీకి టైమ్ కేటాయిస్తోంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నయన్ గజినీలో నటించినప్పుడు జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఓ జర్నలిస్ట్ పంచుకున్నారు.

ఆయన మాట్లాడుతూ ''చెన్నై వైఎంసీఏ గ్రౌండ్‌లో గజినీ సినిమాలో నయనతారను విలన్లు వెంబడించే సన్నివేశాన్ని చిత్రీకరించారు మురుగదాస్. ఆ సీన్ లో నయన్ పరిగెడుతున్నప్పుడు మురుగదాస్ కట్ కట్ చెప్పాడు. ఆ సమయంలో నయన్ ధరించిన చొక్కా వల్ల ఆ సీన్‌లో కాస్త అసభ్యత ఎక్కువగా అన్పించింది. అది చూసిన మురుగదాస్ ఇది చాలా అసభ్యకరం, నేను తీయలేను. మరో షర్ట్ వేసుకో అని అడిగాడు.

Nayanthara faces challenges in Ghajini Movie Sets
Munjya Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న చిన్న సినిమా.. మూడు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

అయితే నయన్‌కి వేరే చొక్కా లేదు. చివరి క్షణంలో ఇలా ఎందుకు చెబుతున్నారు? నేను వేరే బట్టలు కూడా తీసుకురాలేదు. కనీసం మార్చుకోవడానికి కారవాన్ కూడా లేదని చెప్పింది. దీంతో వెంటనే మురుగదాస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వెళ్లి ప్లాట్‌ఫాంపై ఓ షర్ట్‌ కొన్నాడు. తరువాత నయన్ క్యారవాన్ లేకపోవడంతో అక్కడ పార్క్ చేసిన కారు వెనకాలే వెళ్లి క్లోసెట్ లో నిలబడి వేరే షర్ట్ వేసుకుంది అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X