శ్రీరెడ్డిపై విరుచుకుపడ్డ తమిళ నటి.. తప్పుకోవాల్సింది, బహిరంగంగా!
కాస్టింగ్ కౌచ్ వ్యహారం గురించి సెలెబ్రెటీలకు ప్రశ్నలు ఎదురుకావడం ఇప్పుడు సాధారణం అయిపోయింది. టాలీవుడ్ తో పాటు, కోలీవుడ్ లో కూడా శ్రీరెడ్డి దుమారం రేపిన సంగతి తెలిసిందే. బుల్లి తెరపై వెలుగు వెలిగిన నటి ప్రియా భవాని ఇటీవల మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా శ్రీరెడ్డి గురించి ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ప్రియా భవాని ఇచ్చిన సమాధానం చిత్ర పరిశ్రమపై శ్రీరెడ్డి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే విధంగా ఉంది.

చినబాబు చిత్రంతో
బుల్లి తెరపై మెరిసిన ప్రియా భవాని ఇటీవల వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల కార్తీ చినబాబు చిత్రంలో ప్రియా భవాని కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విజయం సాధించింది.

వేధింపులు
సినీరంగంలో నటీమణులపై వేధింపులు ఉన్నమాట వాస్తవం. అన్ని రంగాల్లో మహిళలపై ఈ వేధింపులు ఉన్నాయి. దీనిని తప్పకుండా ఖండించాలి. అలా అని ఈ విషయంలో మొత్తం ఇండస్ట్రీని నిందించడం సరైనది కాదు అని ప్రియా భవాని తెలిపింది.

మన చేతుల్లోనే
కాస్టింగ్ కౌచ్ కు తలొగ్గలా లేదా అనే నిర్ణయం మన చేతుల్లో ఉన్నపుడు ఆ విషయంలో ఆందోళన అవసరం లేదు. ఇష్టం లేకుంటే అంగీకరించకపోతే సరిపోతుంది. దానిని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు.

బహిరంగంగా
కాస్టింగ్ కౌచ్ కు అంగీకరించి వాళ్ళు చెప్పినట్లు చేస్తే అందులో మన తప్పు కూడా ఉంటుంది. ఏదో ఆశించే ఆ పని చేస్తున్నప్పుడు దానిని బహిరంగంగా ఎందుకు చెప్పుకోవడం.. రాద్ధాంతం చేయడం ఎందుకు అంటూ శ్రీరెడ్డికి భవాని కౌంటర్ ఇచ్చింది.

నటన నుంచి
అంత ఇబ్బందిగా ఉంటె నటన నుంచే తప్పుకోవాల్సింది అంటూ భవాని అభిప్రాయ పడింది. తాను భవిష్యత్తులో మరిన్ని కుటుంబ కథా చిత్రాల్లో నటించబోతున్నట్లు ప్రియా భవాని తెలిపింది.


Click it and Unblock the Notifications











