సూరిగాడిని చెప్పుతో, సస్పెన్స్‌లోకి నెట్టిన శ్రీరెడ్డి.. చెన్నైలో హల్‌చల్, విశాల్ ఏంచేయబోతున్నాడంటే!
Recommended Video

శ్రీరెడ్డి మీడియా ఛానల్స్ ని వదిలి ఇప్పుడు ఇంటర్ నెట్ లో సంచలనం గా మారింది. వరుసపెట్టి సోషల్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ సంచలనం మరిన్ని వివాదాలు సృష్టిస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు టాలీవుడ్ ప్రముఖలపై వివాదాస్పద ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమని టార్గెట్ చేసింది. ప్రముఖ దర్శకుడు, ఖుష్బూ భర్త సుందర్, రాఘవ లారెన్స్, విశాల్, ఇతర నటులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కలకలం రేపుతోంది.

నెటిజన్లని సస్పెన్స్ లోకి
శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్ట్ ఒకటి సంచలనంగా మారింది. సూరిగా అని సంభోదిస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి దూషిస్తోంది ఎవరిని అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. చెప్పుతో కొడితే నీ పిచ్చి వదిలిపోద్ది అని శ్రీరెడ్డి ఘాటు కామెంట్స్ చేయడం వివాదంగా మారింది.
చెన్నైలో హల్ చల్
శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో హల్ చల్ చేస్తోంది. వరుసగా యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ హంగామా సృష్టిస్తోంది. తమిళ నటులపై ఆరోపణలు చేస్తోంది. శ్రీరెడ్డి ఆరోపణలతో తమిళ చిత్ర పరిశ్రమలో కదలిక మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.

మళ్లీ జాతీయ మీడియాలో
శ్రీరెడ్డి తమిళ చిత్ర పరిశ్రమపై చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ ప్రముఖులపై చేసిన ఆరోపణలు తరహాలోనే కోలీవుడ్ ప్రముఖులపై కూడా కామెంట్స్ చేస్తుండడంతో శ్రీరెడ్డిపై విమర్శలు అధికం అవుతున్నాయి.

రంగంలోకి విశాల్
ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని హీరో విశాల్ భావిస్తున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నడిగర్ సంఘం తరఫు నుంచి స్పందించాలని విశాల్ భావిస్తున్నాడట. శ్రీరెడ్డి ఇంకెంత దూరం ఈ వివాదాన్ని కొనసాగిస్తుందో అనే చర్చ తమిళ సినీవర్గాల్లో జరుగుతోంది.


Click it and Unblock the Notifications











