తమిళ దర్శకుడిపై శ్రీరెడ్డి కేసు.. రచ్చగా మారుతున్న 'వ్యభిచారి' కామెంట్!
కాస్టింగ్ కౌచ్ పోరాటం పేరుతో అటు సోషల్ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ లో శ్రీరెడ్డి నానా హంగామా చేస్తోంది. తనని వాడుకున్నారంటూ శ్రీరెడ్డి ఇప్పటికే చాలా మంది ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీరెడ్డి హంగామా చెన్నైలో కొనసాగుతోంది. యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ తమిళ ప్రముఖులపై వివాదభరితమైన నిందలు వేస్తోంది.

వ్యభిచారి అంటూ
తాను చాలా మంది దర్శకులతో పడుకున్నాని శ్రీరెడ్డే చెబుతోంది. ఇలా చేస్తే వ్యభిచారం అనే అంటారు. అందుకే ఆమెపై కేసు నమోదు చేస్తున్నా అంటూ తమిళ దర్శకుడు వారాహి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

హీటెక్కిన వ్యవహారం
దీనితో వీరిద్దరి మధ్య వ్యవహారం కాస్త హీటెక్కింది. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అతడిపై విమర్శలు చేస్తోంది. నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే నేను పది అడుగులు వేస్తా అంటూ శ్రీరెడ్డి ఇటీవల కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

వదంతులు
శ్రీరెడ్డిపై వారాహి కేసు నమోదు చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి. శ్రీరెడ్డి వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిందంటూ వార్తలు వచ్చాయి.

పౌరుషంతో
ఈ మొత్తం వ్యవహారాన్ని శ్రీరెడ్డి అవమానంలా భావించింది. పౌరుషంతో తిరిగి వారాహిపైనే కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. వారాహి తనని వ్యభిచారి అని నిందించాడని పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. వీరిద్దరి పరస్పర కేసులపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











