శ్రీరెడ్డి పిటిషన్ విచారణ.. సిబిఐ రంగంలోకి దిగుతుందా!
Recommended Video

మీడియా సంచలనం శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న కాస్టింగ్ కౌచ్ విషయంలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొందరి సినీప్రముఖులు పేర్లని మీడియా వేదికగా ప్రస్తావిస్తూ శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా శ్రీరెడ్డి ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నేడు ఈ పిటిషన్ విచారణకు రానుంది.

సీబీఐని దించాలి
కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న చీకటి కోణాల్ని బయటపెట్టేందుకు సిబిఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శ్రీరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఉత్కంఠ
నేడు ఈ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. తానే స్వయంగా కాస్టింగ్ కౌచ్ కి బలయ్యానని శ్రీరెడ్డి తరచుగా ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులపై ఆరోపణలు చేసింది.

శ్రీరెడ్డిపై కేసులు
శ్రీరెడ్డిపై కూడా వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తానే ప్రముఖులతో పడుకున్నానని శ్రీరెడ్డి వ్యాఖ్యానించడంతో ఆమెని అరెస్ట్ చేయాలని నడిగర్ సంఘం పోలీసులని కోరింది. మరోవైపు దర్శకుడు వారాహి కూడా ఆమెపై కేసు నమోదు చేసాడు.

కోర్టు నిర్ణయం
శ్రీరెడ్డి తరుపున అడ్వాకెట్ కళానిధి వాదనలు వినిపించనున్నారు. కోర్టు శ్రీరెడ్డికు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటిస్తుందా లేక ప్రభుత్వానికి సూచనలు చేస్తుందా అనే విషయం వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











