ఒక్కడు, పోకిరి తర్వాత మహర్షి.. మహేష్ సినిమాపై మనసుపడ్డ క్రేజీ హీరో!

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో బుధవారం రోజు ఘనంగా జరిగింది. వరుస విజయాలతో రాణిస్తున్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ 25వ చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే మహర్షి ట్రైలర్ కూడా విడుదల చేశారు. మహర్షి ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ చిత్ర రీమేక్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

సినిమాపై ధీమా

సినిమాపై ధీమా

ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహర్షి చిత్ర యూనిట్ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేసింది. దిల్ రాజు, వంశీ పైడిపల్లి సహా అందరూ సినిమా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అన్న తరహాలో నమ్మకాన్ని వ్యక్తపరిచారు. మరో నిర్మాత పీవీపీ అయితే ఒక అడుగు ముందుకేసి మే 18న విజయవాడలో గ్రాండ్ గా విజయోత్సవ వేడుక నిర్వహించనున్నట్లు ప్రకటించేశారు. దీనితో మహర్షి చిత్రం ఘనవిజయంపై అభిమానుల్లో కూడా భరోసా ఏర్పడింది.

మహర్షిపై కన్నేసిన విజయ్

మహర్షిపై కన్నేసిన విజయ్

సాధారణంగా ఏదైనా చిత్రం విడుదలై ఘనవిజయం సాధించిన తర్వాత ఇతరభాషలో రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మహర్షి చిత్రం విడుదల కాకముందే రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇళయదళపతి విజయ్ ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రాలైన ఒక్కడు, పోకిరి తమిళ రీమేక్ లో విజయ్ నటించాడు. ఇప్పుడు విజయ్ దృష్టి మహర్షిపై పడ్డట్లు తెలుస్తోంది.

మూడు విభిన్న కోణాల్లో

మూడు విభిన్న కోణాల్లో

మహేష్ బాబు మహర్షి చిత్రంలో మూడు విభిన్న కోణాల్లో కనిపించబోతున్నాడు. కాలేజీ స్టూడెంట్ గా, కార్పొరేట్ సంస్థ అధినేతగా, రైతుల సమస్యలపై పోరాటం చేసే వ్యక్తిగా మహేష్ నటిస్తున్నాడు. రైతులకు సంబంధించిన అంశం ఎమోషనల్ గా ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అయింది. పూజా హెగ్డే మోడ్రన్ లుక్ లో కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

మే 9న విడుదల

మే 9న విడుదల

మహర్షి చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీ ఈ చిత్రానికి నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే ఆకట్టుకుంటోంది. ఇక విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక మహర్షి చిత్ర రీమేక్ పై దృష్టిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లీ, విజయ్ చిత్రం ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతోంది. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X