200 బెనిఫిట్ షోలు, 170 కోట్ల బిజినెస్.. బాహుబలి2 రికార్డులు బద్దలు కొట్టే మొనగాడు!
Recommended Video

తమిళనాడు వ్యాప్తంగా ఇళయదళపతి విజయ్ ఫీవర్ వ్యాపిస్తోంది. మరికొద్దిరోజుల్లో దీపావళి ధమాకా సర్కార్ చిత్రం విడుదల కానుండడంతో అభిమానుల్లో ఇప్పటినుంచే కోలాహలం నెలకొని ఉంది. ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ట్రేడ్ వర్గాలకు సైతం చెమటలు పట్టిస్తున్నాయి. విజయ్ దాదాపుగా సూపర్ స్టార్ రజని స్థాయిని అందుకున్నట్లే అని అంచనా వేస్తున్నారు. తుపాకీ, కత్తి, తేరి, మెర్సల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో విజయ్ దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు విజయ్ మార్కెట్ అమాంతం పెరిగిపోతోంది. సర్కార్ నవంబర్ 6 న విడుదల కానున్న నేపథ్యంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

సూపర్ హిట్ కాంబినేషన్
సర్కార్ చిత్రాన్ని సందేశాత్మక చిత్రాల దర్శకుడు మురుగదాస్ రూపొందిస్తున్నాడు. మురుగదాస్, విజయ్ కాంబోలో ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. తుపాకీ, తేరి చిత్రం చిత్రాలు అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో హ్యాట్రి చిత్రం గా రాబోతున్నా సర్కార్ పై అభిమానుల్లో ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి.
అరవింద సమేత హీరోయిన్ ఒంటి రంగు గురించి కామెంట్.. ఎలా తిప్పికొట్టిందో తెలుసా!

పొలిటికల్ కథాంశం
ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై అద్భుత రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పొలిటికల్ కథాంశంతో మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది. తుపాకీ చిత్రంలో విజయ్ ని ఆర్మీ ఏజెంట్ గా, కత్తి చిత్రంలో రైతు సమస్యలపై పోరాడే యువకుడిగా మురుగదాస్ చూపించారు. ఈ చిత్రంలో విజయ్ పాత్రపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.

కళ్ళు చెదిరే ప్రీరిలీజ్ బిజినెస్
సర్కార్ చిత్రం విడుదలకు ముందే తమిళనాడు వ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. థియేట్రికల్ హక్కులే 120 కోట్లకు పైగా అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక శాటిలైట్ రైట్స్, ఇతర హక్కులు అన్ని కలుపుకుంటే సర్కార్ బిజినెస్ 170 కోట్లవరకు చేరిందనేది టాక్.

200 బెనిఫిట్ షోలు
సర్కార్ చిత్రానికి విడుదల ముందు రోజు రాత్రి నుంచే తమిళనాడు వ్యాప్తంగా భారీ స్థాయిలో బెనిఫిట్ షోలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 200 బెనిఫిట్ షోలు ప్రదర్శించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం చెన్నై నగరంలోనే 100 బెనిఫిట్ షోలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

బాహుబలి 2 రికార్డులు
తమిళనాడులో బాహుబలి 2 చిత్ర రికార్డులని సర్కార్ చిత్రం బద్దలు కొడుతుందనే అంచనాలు మొదలయ్యాయి. విజయ్ మార్కెట్ పరిధి గమనించిన ట్రేడ్ విశ్లేషకులు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. హిట్ టాక్ వస్తే రికార్డుల మోత ఖాయంగా కనిపిస్తోంది. మెర్సల్ చిత్రం వివాదంలో చిక్కుకున్నా వసూళ్ల సునామీని మాత్రం ఎవరూ అడ్డుకోలేకపోయారు.


Click it and Unblock the Notifications











