Bigg Boss Telugu 7: అబ్బాయిలంతా కలిసి ప్రియాంకను అంతలా మోసం చేశారా.. రైతుబిడ్డే మొదటివాడా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని విధంగా టాస్క్ లు ఇస్తూ షోను మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. ఉల్టాపుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీజన్ ప్రక్షకులను అలరించడంలో పూర్తిగా సఫలం అవుతుంది. ఇప్పటికే 12 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో 13వ వారంలోనూ అద్భుతంగా సాగుతోంది. ఈక్రమంలోనే ఈవారం టికెట్ టు ఫినాలే టాస్క్ నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా ఈ టాస్క్ ను నిర్వహిస్తున్న బిగ్ బాస్ స్నేహితుల మధ్యే చిచ్చు పెడుతున్నాడు.

ముఖ్యంగా స్పై, స్పా బ్యాచ్ ల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. అయితే స్పా బ్యాచ్ లో ఉన్న అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ ల మధ్య కూడా తరచుగా గొడవలు జరుగుతున్నాయి. గాళం వెయ్ అనే టాస్క్ తో అమర్ దీప్ తొలిసారిగా ప్రియాంకను మోసం చేశాడు. వీరిద్దరి మధ్య ఎప్పుడూ లేని విధంగా గొడవ జరిగింది. ఇక ఆ తర్వాత నుంచి ప్రితోరోజూ వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే వాటిని ఆపాల్సిన శోభా శెట్టి... అమర్ దీప్ పక్కన చేరి ప్రియాంక జైన్ పై మరింత కోపం పెరిగేలా చేస్తోంది.

All Boy Contestants Cheated Priyanka in Ticket to Finale Task in Bigg Boss Telugu 7

ఇదంతా ఇలా ఉండగా.. హౌస్ లో అబ్బాయిలు అంతా కలిసి తనను చాలా మోసం చేశారని ప్రియాంక జైన్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కు చెప్పంది. ముఖ్యంగా కావాలనే మీరంతా నాపై పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నేనేం చేయలేదు అని రైతుబిడ్డ అనగానే.. లేదు అసలు మొదలు పెట్టింది నువ్వే అంటూ వివరించింది ప్రియాంక జైన్. ఏంటి నేనా అంటే.. అవును నువ్వే అది నీ మనసుకు తెలుసు, నీ గుండెకు తెలుసు అంటూ చెప్పుకొచ్చింది. వాస్తవానికి పల్లవి ప్రశాంత్ యే తన స్ట్రాటెజీ తో గేమ్ ను మార్చాడు. దాన్నే ఫాలో అవుతూ అమర్ దీప్ ప్రియాకను ఓడించాడు.

గాలం వెయ్ అనే టాస్క్ లో అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్ లు.. పాల్గొన్నారు. అయితే ఇందులో మొదటి రౌండ్ లో అంబటి అర్జున్ గాలం వేసి కరెక్టుగా బాల్ ను లాగేశాడు. ఆ తర్వాత బాల్ వేయగా... ప్రియాంక లాగేసింది. కానీ పక్కనే ఉన్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మాత్రం ఆ బాల్ సర్కిల్ బయటకు రాగానే ఆమె చేతిలోకి రాకుండా లాక్కెళ్లిపోయాడు. ఇక ఆ తర్వాత అమర్ దీప్.. పల్లవి ప్రశాంత్ లాగే గేమ్ ఆడడం ప్రారంభించాడు.

All Boy Contestants Cheated Priyanka in Ticket to Finale Task in Bigg Boss Telugu 7

మూడో రౌండ్ లో భాగంగా ప్రిన్స్ యావర్ బాల్ ను లాగగా... పక్కనే ఉన్న అమర్ దీప్ ఆ బాల్ ను లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలోనే యావర్, అమర్ దీప్ లు ఇద్దరూ పోటాపోటీగా కొట్టుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఎలాగోలా బాల్ ను దక్కించుకున్న ప్రిన్స్ యావర్.. అమర్ దీప్ పై కాస్త ఫైర్ అయ్యాడు. అయితే చివరగా మరో రౌండ్ పెట్టగా.. బాల్ ను ప్రియాంక జైన్ లాగేసింది. అయితే మరోసారి అమర్ దీప్ అదే స్ట్రాటెజీని ప్లే చేశాడు. తన స్నేహితురాలని కూడా చూడకుండా ఆమెపై పడి మరీ బాల్ ను లాక్కున్నాడు. ఇలా అబ్బాయిలు అంతా కలిసి ప్రియాంకను మోసం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X