Amardeep: అమర్‌దీప్‌కు మరో షాక్.. ఆమెతో ఇంట్లో బందీగా..!

బిగ్ బాస్ తెలుగు 7 రన్నరప్ అమర్ దీప్ చౌదరి గురంచి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమాయకత్వం, చిన్న పిల్లాడి మనస్తత్వంతో అనేక సమస్యలు కొని తెచ్చుకున్న ఈయన తాజాగా మరో సమస్యలో ఇరుక్కుపోయాడు. ముఖ్యంగా ఆమెతో అతడిని ఇంట్లో బందీగా చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ గా మారింది. మరి ఈ సమస్య నుంచి అమర్ దీప్ బయట పడ్డాడా, పడితే ఎలా వచ్చాడు వంటి విషయాలను మనం ఈ స్టోరీలో చూసేద్దాం.

బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కు వెళ్లిన మౌనరాగం సీరియల్ నటుడు అమర్ దీప్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రియాంక జైన్, శోభాశెట్టిలతో కలిసి గ్రూప్ గేమ్ ఆడిన ఈయన.. టాప్ 2లో నిలిచాడు. ఎంతో నెగిటివిటీ మధ్య రన్నరప్ గా నిలిచిన ఈయన గ్రాండ్ ఫినాలే రోజు అనేక సమస్యలు ఎదుర్కున్నాడు. ముఖ్యంగా ఈయనపై దాడి చేసేందుకు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ప్రయత్నించగా.. ఈయన కారు కూడా ధ్వంసం అయింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు కాకుండా ఫ్యామిలీతో సహా బయట పడ్డాడు అమర్ దీప్.

Amardeep Facing Antoher Problem In Chennai After Bigg Boss Check Details

అయితే తాజాగా అమర్ దీప్ మరో సమస్యలో ఇరుక్కుపోయాడు. ముఖ్యంగా ఆయన భార్య తేజస్వి గౌడనే నేరుగా అందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా పోస్ట్ చేసింది. అందులో అమర్ దీప్ ఎలాంటి సమస్యలో ఇరుక్కుపోయాడు, అసలేం జరిగింది, ఎవరు అతడిని లాక్ చేశారు, ఎందుకు లాక్ చేశారు వంటి విషయాలను చెప్పింది. ముఖ్యంగా దాన్నుంచి తన భర్త ఎలా బయట పడ్డాడు వంటి విషయాలను కూడా వివరించింది.

అయితే తేజస్వి గౌడ యూట్యూబ్ లో పెట్టిన వీడియోలో.. అమర్ దీప్ తో పాటు తాను.. మరికొంత మంది స్నేహితులు చెన్నైలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ముఖ్యంగా నీతోనే డ్యాన్స్ షోకోసం వారు ప్రాక్టీస్ చేస్తుండగా.. ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. ముఖ్యంగా వాళ్లంతా పైన ఫ్లోర్ లో ఉండగా.. కింద్ ఉన్న షెటర్ ను లాక్ చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. ముఖ్యంగా ఇనుప గేట్లు ఉండడంతో.. వాటిని వెల్డింగ్ చేసి మరీ లాక్ చేశారు. అలా వాళ్లు అసలే బయటకు రాకుండా.. అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది.

కమల్ హాసన్, జయసుధ పెళ్లి చేసుకోవాలనుకున్నారా?.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!

అయితే అమర్ దీప్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోగా... డెలివరీ బాయ్ కింద లాక్ చేసి ఉందని చెప్పి తెలుసుకుని కిందకు వచ్చి చూశారట. అప్పటికే అది లాక్ అయి ఉండగా.. తమకు తెల్సిన వాళ్లకు ఫోన్ చేశారు. వారు వచ్చి చూసి, వెల్డింగ్ చేసే వాళ్లను తీసుకు వచ్చి.. అనేక గంటల తర్వాత దాన్ని ఓపెన్ చేయించారు. అయితే అప్పటి వరకు లోపల బందీగా ఉన్న అమర్ దీప్, తేజు, తమ స్నేహితులు ఆ రంధ్రాల నుంచే ఫుడ్ తీసుకుని కడుపు నింపుకున్నారు. అయితే ఇలా లాక్ చేసింది ఎవరు అనేది మాత్రం వాళ్లు తెలుసుకోలేకయపోయారట.

ఈ విషయాన్ని నేరుగా తేజస్వి గౌడనే తెలిపింది. అయితే లోపల ఎక్కువ మంది ఉండడంతో.. అటు అమర్ దీప్ కానీ, తేజస్వి కానీ అంతగా భయపడలేరు. కానీ కాస్త టెన్షన్ పడ్డారు. చివరకు స్నేహితులు రాగా సమస్య నుంచి బయట పడి సంబురపడిపోయారు. మీరు కూడా ఓసారి ఈ వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X