నా శాపం గట్టిగానే.. ఆ హీరో ఇంకా కోలుకోలేదు... యాంకర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్

తెలుగు బుల్లితెరపై తొలి తరం యాంకర్లలో ఝాన్సీ కూడా ఒకరు. అద్భుతమైన వాయిస్, అందం, చూడచక్కని హోస్టింగ్‌తో ఆమె ఆకట్టుకున్నారు. యాంకరింగ్‌ మాత్రమే కాకుండా బుల్లితెర, వెండితెరపై నటిగా రాణించారు. అయితే ఆకస్మాత్తుగా యాంకరింగ్‌ను వదిలేసి కొన్నాళ్లు సైలెంట్ అయిపోయారు. నటుడు జోగీ నాయుడిని వివాహం చేసుకుని కొన్నాళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు. అయినప్పటికీ పట్టుదల, ధైర్యంతో లైఫ్ లీడ్ చేస్తున్నారు ఝాన్సీ. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదురైన అవమానాలు, ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
ఆ హీరోయిన్‌తో బ్రేకప్? నటితో రిలేషన్‌పై అలా తేల్చేసిన మెగా హీరో!
ఆ హీరోయిన్‌తో బ్రేకప్? నటితో రిలేషన్‌పై అలా తేల్చేసిన మెగా హీరో!

నన్ను వెన్నుపోటు పొడిచిన వాళ్ల దగ్గరికి మళ్లీ నేను వెళ్లలేదు, పని ఇవ్వమని అడగలేదు. నాకు డబ్బులు బాకీ ఉన్నారని 100 సార్లు ఫోన్ చేసి గొడవపడి, ఇంటికి మనుషుల్ని పంపించి ఇలాంటివి చేయలేవు. అలాంటి వ్యక్తి ఎదురుగా కనిపిస్తే నిలబడటం కూడా కష్టమే. అయినా ఈ పాపం ఊరికే పోదు .. నా శాపం చాలా గట్టిగానే తగులుతుందని నాకు తెలుసు. అలాంటి వాళ్లు ఎందరో ఉన్నారు. రెండు రోజులు క్యారెక్టర్ చేయించుకుని పీకేసిన వాళ్లకి తెలియాలి ఆ శాపం.. పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో రెండు రోజులు క్యారెక్టర్ చేశాను. నా డబ్బులు నాకు ఇచ్చేశారు.. కానీ చెప్పా పెట్టకుండా నా స్థానంలో మరొకరిని షూట్ చేస్తే అది అవమానించడమే. అందుకే నా శాపం బాగా తగిలింది. మామూలుగా తగల్లేదు.. ఇప్పటి వరకు వాళ్లు కోలుకుని మళ్లీ లేవలేదని ఝాన్సీ చెప్పారు.

Anchor Jhansi Opens Up on Career Betrayals TV Industry Struggles and Trolls

పోస్ట్ బాక్స్ నెంబర్ 1562 అని జెమినీ టీవీలో ఓ షో చేసేవాళ్లం.. ఉత్తరాలు సాయంతో ఫీడ్ బ్యాక్ తీసుకునేవాళ్లం. ప్రేక్షకుల ఉత్తరం టెలివిజన్‌లో చదువుతున్నారంటే అది వాళ్లకో థ్రిల్... అది గొప్ప ప్రోగ్రామ్. ఇప్పటిలా ఫోన్లు లేవు, కమ్యూనికేషన్ చేయడానికి లేదు. ఫలానా టైంకి షూటింగ్ వెళ్లాలని చెబితే అక్కడికి వెళ్లే దానిని.. ఓ రోజున వెళ్లి చూస్తే నా ప్లేస్‌లో మరొకరు హోస్ట్‌గా కనిపించారు. ఏం జరుగుతుందో నాకు అర్ధం కాలేదు.. ఈ టీమ్ మొత్తం నాకు బాగా ఆప్తులు, ఎంత దగ్గరి వాళ్లో చెప్పలేను. ఇలా ఎందుకు చేశారని అడిగితే కొంచెం ఛేంజ్ ఉంటే బాగుంటుందని అన్నారు. కానీ నాకు ముందు చెప్పాలి కదా అని బాధపడ్డానని ఝాన్సీ గుర్తుచేసుకున్నారు.

Recommended For You
'అతనంటే పిచ్చి... నా కల తీరకుండానే తిరిగిరాని లోకాలకు’
'అతనంటే పిచ్చి... నా కల తీరకుండానే తిరిగిరాని లోకాలకు’

ధర్మవరపు సుబ్రహ్మణ్యం, జగపతి బాబు గారు చేసిన కొన్ని కార్యక్రమాలను తర్వాత నేను కంటిన్యూ చేశాను. కానీ జెమినీ టీవీలో నాకు జరిగిన ఎపిసోడ్ దెబ్బతో నేను బాగా నేర్చుకున్న విషయం ఏంటంటే.. నేను ఆ వ్యక్తితో మీకు నేను హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందా? మీకు చెప్పారా? అని అడిగేదానిని. ఏ రీజన్ వల్ల హోస్ట్‌ని మారుద్దామని వాళ్లు అనుకుంటున్నారో నాకు అనవసరం. టీఆర్పీ బాలేదని, ప్రెజర్ ఎక్కువైందనో ఎలాంటి రీజన్ వల్ల మార్చారు అనేది నాకు అనవసరం. కొందరికీ నా షో.. నా బ్రాండ్ అనే ఒక అనుబంధం ఉంటుంది. జగపతి బాబుగారు, మనోగారు, అవసరాల శ్రీనివాస్ గారు చేస్తున్న షోలలో నుంచి వారిని తీసేస్తున్నప్పుడు ముందే కనుక్కుని తర్వాత షోని నేను టేకప్ చేశాను అని ఝాన్సీ చెప్పారు.

You May Also Like
ప్రభాస్‌‌పై నోరుజారిన సుప్రీత.. డార్లింగ్‌ను‌ అంత మాట అనేసిందా..
ప్రభాస్‌‌పై నోరుజారిన సుప్రీత.. డార్లింగ్‌ను‌ అంత మాట అనేసిందా..

కొందరు నేను షోలు చేయకూడదని మైండ్ గేమ్ ఆడేవారు. వాళ్లు నన్ను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. నా వ్యక్తిత్వాన్ని తక్కువ చేసేలా రాతలు రాసేవారు. నా ఫేస్‌బుక్‌లోనూ చాలా తక్కువ కామెంట్స్‌కి రిప్లయ్ ఇస్తాను, ఉండాలి కాబట్టి ఉంటాను, అవసరమైన దానికే చర్చలోకి వెళ్తాను. నచ్చకపోతే మాత్రం నాదైతే నేను డిలీట్ చేస్తాను. విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది.. కానీ కించపరిచేలా కామెంట్స్ పెట్టొద్దు. నా కాన్ఫిడెన్స్ కేవలం ఒక మాటతో పడిపోయేదైతే ఈ పాటికీ ఈ సామ్రాజ్యం కూలిపోయేది, ఈ సామ్రాజ్యానికి నేను తిరుగులేని సామ్రాజ్ఞిని. మీ మాటల వల్ల నేను పడను అని ఝాన్సీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఝాన్సీ వ్యక్తిత్వంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X