ప్రభాస్‌పై నోరుజారిన సుప్రీత.. డార్లింగ్‌ను అంత మాట అనేసిందా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచితనానికి, స్నేహానికి మారుపేరుగా, వివాదరహితుడిగా ఎంతోమంది మన్ననలు పొందారు. ఒక నటుడిగా కంటే ఆయన వ్యక్తిత్వానికే ప్రేక్షకులు ఫిదా అవుతారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎలాంటి వివాదం లేకుండా, ఏ మచ్చ లేకుండా సక్సెస్‌ఫుల్‌గా తన ప్రస్థానాన్ని సాగిస్తూ అందరి చేత డార్లింగ్ అని ముద్దుగు పిలిపించుకుంటున్నారు ప్రభాస్. ఈ పాన్ ఇండియా సూపర్‌స్టార్ గురించి ముందుగా చెప్పాల్సి వస్తే ఆయన ఆతిథ్యం గురించే చెబుతారు. తన ఇంటికి వచ్చే వారికే కాదు.. సెట్‌లో తనతో పాటు షూటింగ్‌లో ఉన్న వారికి విందు భోజనంతో కడుపు నింపేస్తారు ప్రభాస్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు ఆయన ఇంటి రుచిని ఆస్వాదించిన వారే. తాజాగా ప్రభాస్ పెట్టే గుణంపై ప్రముఖ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీత నోరు జారారు. ఈ వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్‌లో తల్లి, అక్క, వదిన, అమ్మ, అత్త పాత్రలతో కొన్నేళ్ల పాటు తన హవా చూపించారు సురేఖ వాణి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఏడిపించినా.. కమెడియన్‌గా నవ్వించినా ఆమెకే చెల్లింది. భర్త మరణం, కుటుంబ బాధ్యతలు, తదితర కారణాలతో ఇప్పుడు పూర్తిగా సినిమాలను తగ్గించేశారు సురేఖ. ఈమె కూతురే సుప్రీత.. తల్లిలాగే ఆకట్టుకునే రూపం, అందంతో ఆకట్టుకుంటున్నారు సుప్రీత. తల్లితో కలిసి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ చిన్న వయసులోనే సెలబ్రిటీగా మారిపోయారు సుప్రీత. ఇప్పుడిప్పుడే సినిమాలలో నిలదొక్కుకునేందుకు అడుగులు వేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ.

తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో బిగ్‌బాస్ ఫేమ్ తేజస్వి మదివాడ హోస్ట్‌గా ప్రసారమవుతున్న కాకమ్మ కథలు సీజన్ 3 టాక్ షోలో యూట్యూబర్ విజయేంద్ర సింహతో కలిసి పాల్గొన్నారు సుప్రీత. ఈ సందర్భంగా తేజస్వి అడిగిన ప్రశ్నలకు సుప్రీత చెప్పిన సమాధానాలు, మధ్యలో నిఖిల్ మాటలు వివాదానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. ఆశకు హద్దుండాలి అనే రౌండ్‌లో భాగంగా సెటప్ బాయ్స్ అంటూ తేజస్వి చెప్పగా.. ఎవరైనా వస్తారా? అని నిఖిల్ అడుగుతాడు. యూఎస్ నుంచి నువ్వు తెచ్చుకోలేదా? అని కౌంటర్ వేస్తుంది తేజస్వి. వాడు ఎక్కడివి అక్కడే వదిలేస్తాడని పంచ్ పేలుస్తుంది సుప్రీత.
ఆ తర్వాత కొందరు స్టార్ హీరోల ఫోటోలను చూపిస్తుంది తేజస్వీ. తొలుత విజయ్ దేవరకొండ ఫోటో రాగా.. ఆయనకు పెళ్లయిపోయిందని అంటుంది సుప్రీత. లేకపోతే ఏసేద్దామనేనా అని నిఖిల్, తేజస్వీ సెటైర్ వేస్తారు. ఆ వెంటనే అడివి శేష్ ఫోటో రావడంతో ఈయన ఓకే అంటుంది సుప్రీత. ఏకంగా అడివిలోనేనా తేజస్వీ దారుణంగా మాట్లాడుతుంది. ఇంతలో ప్రభాస్ ఫోటో కనిపించడంతో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అని తేజస్వి చెబుతుంది. ఈయన మ్యాట్రెస్ (బెడ్) మీద కూడా ఫుడ్ పెడతాడేమోనంటూ సుప్రీత అనడంతో నిఖిల్, తేజస్వీలు షాక్ అవుతారు. నీ నోరు అంటూ నిఖిల్ కూడా చిరాకు పడతాడు.
వీడు ఓకేనా అని నిఖిల్‌ను ఉద్దేశిస్తూ తేజస్వీ అనడంతో వీడే బెటర్ అంటుంది సుప్రీత. అడివి శేష్ ఒకసారి స్టోరీ చెబుతానని రమ్మని చెప్పారు.. ఇంతలో ఫీజు పోయి లైట్స్ ఆఫ్ అయ్యాయని సుప్రీత చెబుతుండగా ఫీజ్ కాదు నీదేనని తేజస్వీ కౌంటర్ వేసింది. ఆ తర్వాత సన్నీలియోన్ తదితరుల గురించి వీరి ముగ్గురి మధ్య దారుణమైన సంభాషణ జరిగింది. ఇక చివరిలో మా నాన్న నా సక్సెస్, ఎదుగుదల చూడలేకపోయారనే లోటు ఎప్పటికీ వెంటాడుతూ ఉంటుందని చెప్పింది సుప్రీత.
నీకు ఏ హీరోతో బిగ్‌స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తేజస్వీ అడగ్గా.. విజయ్ దేవరకొండతో, అది కూడా రొమాంటిక్ సీన్ అని రిప్లయ్ ఇచ్చింది. అయితే ఈ ప్రోమో ఆద్యంతం అన్నీ డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతు పదాలు ఎక్కువగా వినిపించడంతో నెటిజన్లు ఈ షోపై మండిపడుతున్నారు. మొదట్లో ఈ షో బాగానే ఉండేదని రాను రాను దిగజారిపోతోందని కామెంట్స్ పెడుతున్నారు. అన్నింటికీ మంచి ప్రభాస్ వ్యక్తిత్వంపై సుప్రీత చేసిన కామెంట్స్ వైరల్ అవుతుండగా.. డార్లింగ్ అభిమానులు విరుచుకుపడే అవకాశం ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో?


Click it and Unblock the Notifications



