Anchor Rashmi: యాంకర్ రష్మి అసలైన ప్రేమికుడు అతడే.. అదిరిపోయే గిఫ్టిచ్చిన లవర్ బాయ్!

బుల్లితెరపై అందాల యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మి గౌతమ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె అటు సినిమాలతో పాటు ఇటు షోలు చేస్తూ బాగానే సంపాదించుకుంటోంది. డబ్బులతో పాటు ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్న ఈమెకు సుడిగాలి సుధీర్ కు చాలా ఏళ్ల పాటు లవ్ ట్రాక్ వేయగా.. అంతా వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని అనుకున్నారు.

కానీ అదంతా అబద్ధం అని వాళ్లు చాలా సార్లే కొట్టి పడేశారు. ఇటు రష్మితో పాటు అటు సుధీర్ కూడా తమ మధ్య అలాంటి ఫీలింగ్ లేదని క్లారిటీ కూడా ఇచ్చేశారు. అయితే తాజాగా యాంకర్ రష్మి ప్రియుడు స్టేజీ మీదకు వచ్చాడు. ఆమెకు అదిరిపోయే బహుమతులు కూడా ఇవ్వగా.. రష్మి చాలా ఎమోషనల్ అయింది. స్టేజీ మీదే కంటతడి పెట్టుకుంది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Anchor Rashmi Real lover Face Revealed And His Special Gift to Rashmi Check Details

ఒడిశాకు చెందిన రష్మి గౌతమ్.. పుట్టి పెరిగిందంతా విశాఖపట్నంలోనే. అయితే సినిమాలపై ఉన్న ప్రేమతో వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయిందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా 2002లో సవ్వడి అనే సినిమాతో కెరియర్ ప్రారంభించింది. కానీ ఆ సినిమా విడుదల కాకపోవడంతో.. ఉదయ్ కిరణ్ హీరోగా చేసిన హోలీ సినిమాలోనూ సహాయ పాత్ర పోషించింది. ఇలా మంచి పేరు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తోంది. ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతూనే.. మరోవైపు యాంకర్ గా కూడా రాణిస్తోంది.

ప్రస్తుతం 35 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఈమె పెళ్లి, ప్రియుడుకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా జబర్దస్త్ షోలో చేస్తున్నంత కాలం.. సుధీర్, రష్మిలకు లవ్ ట్రాక్ వేయగా.. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అయ్యారు. వీరి జంటకు ఎంతో మంది అభిమానులు అయ్యారు. కేవలం తెరమీద మాత్రమే వీరిద్దరికీ లవ్ ఉన్నట్లు చూపించగా.. నిజంగానే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని అంతా అనుకున్నారు. కాదని చాలా సార్లే చెప్పినా కొంత మంది మాత్రం ఇప్పటికీ నమ్మట్లేదు.

OTTలోకి వచ్చేసిన హిందీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ.. తెలుగులో కావాలంటే అక్కడ చూసేయండి!

అయితే ప్రస్తుతం సుధీర్ సినిమాలపై మాత్రమే ఫోకస్ చేయగా.. జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పేశాడు. అప్పటి నుంచి ఎలాంటి లవ్ ట్రాక్ లేకుండానే రష్మి రచ్చ చేస్తోంది. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు సంబంధించిన ఓ ప్రోమో విడుదల అయింది. అందులో రష్మికి ఓ బుల్లితెర నటుడు ప్రపోజ్ చేశాడు. ముఖ్యంగా తనకు యాంకర్ రష్మి అంటే ఎంతో ఇష్టమో వివరించాడు. అతనెవరో కాదు.. డ్యాన్సర్ పండు. డ్యాన్సర్ గా కెరియర్ ప్రారంభించిన ఈయన.. కామెడీ షోలతో పాటు అనేక షోలలో కనిపిస్తూ.. బుల్లితెరపై సందడి చేస్తుంటాడు. అయితే తాజాగా ఈయన యాంకర్ రష్మి ప్యాన్ బాయ్ అని చెప్పుకొని ఆమెకోసం ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్ చేశాడు.

ఇంతేనా నువ్వు ఆమెకు ఇచ్చేది అనగా.. ఆయన తెచ్చిన బహుమతులు ఇచ్చాడు. అదిరిపోయే సర్ ప్రైజ్ ఇవ్వగా అంతా షాక్ అయ్యారు ముఖ్యంగా రష్మికా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెంచుకున్న కుక్క ఇటీవలే చనిపోయింది. దానితో రష్మి దిగిన సెల్ఫీని.. పెద్ద ఫొటోగా చేయించి గిఫ్టుగా ఇచ్చాడు పండు. అది చూసిన వెంటనే రష్మి కన్నీటి పర్యంతం అయింది. ఇలా ఆమె ఫుల్ ఎమోషనల్ అయ్యేలా చేసి.. నిజమైన అభిమాని, ప్రేమికుడిగా అందరి మదిలో నిలిచాడు డ్యాన్సర్ పండు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X