శ్రీముఖి తల్లిదండ్రుల వీడియో వైరల్.. నెటిజన్ సెటైర్‌కు రామ్ కౌంటర్
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన ఎంతో మంది సెలెబ్రిటీలు సెన్సేషన్ అవుతున్నారు. అలా ఇప్పటికే ఎంతో మంది హైలైట్ అయ్యారు. అలాంటి వారిలో ఫేమస్ యాంకర్ శ్రీముఖి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. చాలా కాలం నుంచే ఇంటర్నెట్‌లో హైలైట్ అవుతోన్న ఈ జంట.. ఈ మధ్య కాలంలో తరచూ తమదైన వీడియోలు చేస్తూ హాట్ టాపిక్ అవుతోన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తాజాగా శ్రీముఖి తల్లిదండ్రులు ఓ వీడియో చేశారు. దీనిపై ఓ నెటిజన్ ట్రోల్ చేయడంతో ఆమె ఫాదర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలేంటో మీరే చూసేయండి!
అలా వచ్చి.. ఫుల్ ఫేమస్
యాంకర్ అవడానికి ముందే శ్రీముఖి సినిమాల్లోకి వచ్చింది. అందులో తనదైన నటనతో మెప్పించి మంచి పేరు అందుకుంది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి కూడా అడుగు పెట్టి యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలా దాదాపు పదేళ్లుగా యాంకరింగ్ రంగంలో హవాను చూపిస్తూ క్యూట్ బ్యూటీ శ్రీముఖి టాప్ ప్లేస్‌లోకి వెళ్లిపోయింది.

బిగ్ బాస్‌తో వాళ్లు కూడా
బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి తల్లిదండ్రులు తమ తమ రంగాల్లో విశేషంగా రాణిస్తూ వెళ్తున్నారు. అదే సమయంలో అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో కూడా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీముఖి బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు హౌస్‌లోకి వచ్చారు. అప్పుడు తమదైన రీతిలో మెప్పించారు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ ఫుల్ పాపులర్ అయిపోయారు.
సోషల్ మీడియాలో అలా
శ్రీముఖి తల్లిదండ్రులు సోషల్ మీడియా వల్ల ఫుల్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. ముఖ్యంగా వీళ్లిద్దరూ తరచూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో శ్రీముఖి తల్లిదండ్రులు డ్యాన్స్ వీడియోలు చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇలా వీళ్లిద్దరూ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Shanvi Srivastava: షర్ట్ విప్పేసిన హీరోయిన్.. లోపల కూడా ఏమీ వేసుకోకుండా హాట్ షో
సామెత గుర్తుకొచ్చింది
సోషల్ మీడియాలో విపరీతంగా బిజీగా ఉంటోన్న శ్రీముఖి తండ్రి ఇటీవలే తన భార్యతో కలిసి 'మేరా దిల్ లూట్ గయీ' అనే పాటకు డ్యాన్స్ చేశాడు. దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ 'నాకు ఒక సామెత గుర్తుకు వచ్చింది' అని కామెంట్ పెట్టింది. దీంతో అందరు నెటిజన్ల కంటే ఆమె పెట్టిన ఇది హాట్ టాపిక్ అవుతోంది.
ఆపేశావేంటి చెప్పమ్మా
సదరు నెటిజన్ పెట్టిన కామెంట్‌కు శ్రీముఖి తండ్రి 'ఆపేశావే చెప్పమ్మా' అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీనికి ఆ నెటిజన్ 'మీరు ఈ వయసులో ఉన్నప్పుడు మీరు గాని మేడం గారు గాని ఇంత యాక్టివ్‌గా ఉన్నారు. ఇంకా శ్రీముఖిలా ఉన్నప్పుడు ఇంకెంత యాక్టివ్‌గా ఉన్నారో అంటున్నాను. సార్ నేను శ్రీముఖికి పెద్ద ఫ్యాన్‌ను. మీరన్న మేడం గారు అన్న చాలా ఇష్టం' అని కవర్ చేసింది.


Click it and Unblock the Notifications











