యాంకర్ సుమ ఒక్కో షోకి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఆమె సంపాదన తెలిస్తే మతి పోవాల్సిందే!

Anchor Suma Remuneration: యాంకరింగ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు యాంకర్ సుమ. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా టెలివిజన్ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు సుమ. తన మాటతీరు, చమత్కారం, కామెడీ టైమింగ్, స్టేజ్ ప్రెజెన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు సుమ అంటే ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఆమెను అభిమానులు "బుల్లితెర మహారాణి", "యాంకరింగ్ క్వీన్", "స్టేజ్ రూలర్" అంటూ పొగిడేస్తుంటారు. అయితే.. తాజాగా సోషల్ మీడియాలో యాంకర్ సుమ రెమ్యూనరేషన్‌ ఎంత? అనేది హాట్ టాపిక్ గా మారింది.

బుల్లితెరపై రారాజుగా వెలుగుతోంది యాంకర్‌ సుమ. ఆమె తర్వాత ఎంతో మంది యాంకర్లు వచ్చినా, ఆమె ను మాత్రం ఇప్పటివరకు ఎవరూ దాటలేకపోయారు. ఆమెకు ఫ్యామీలి ఆడియన్స్ కు ఎంత దగ్గరగా ఉంటుందో, యువతకు కూడా అంతే క్రేజ్. చిన్న షో నుంచి భారీ సినీ వేడుక ఎక్కడైనా సుమ ఉంటే ఆ ప్రత్యేక ఆకర్షణ. నిజానికి సుమ మలయాళీ కుటుంబానికి చెందినవారు. అయినా తెలుగులో ఆమెకు ఉన్న పట్టు చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. స్వచ్ఛమైన తెలుగు ఉచ్ఛరణ, సరదా సంభాషణలు, చమత్కార పంచులు...ఇవన్నీ కలిపి ఆమె నెంబర్ వన్ యాంకర్‌గా నిలబెట్టాయి.

Anchor Suma Remuneration Revealed TV Queen Earning Crores Every Year in Tollywood Buzz

పెద్ద పెద్ద స్టార్ హీరోలతోనైనా, కొత్త హీరోలతోనైనా సమానంగా మాట్లాడగలగడం ఆమె ప్రత్యేకత. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు, సక్సెస్ మీట్లు, టెలివిజన్ షోలు, స్పెషల్ ఇంటర్వ్యూలు, అవార్డు వేడుకలు... ఇలా ఎక్కడ చూసినా సుమ హవానే కనిపిస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల ఈవెంట్లకు సుమ ఉంటేనే షోకు జోష్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. యాంకర్ సుమ రెమ్యూనరేషన్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సుమ ఏడాదికి దాదాపు రూ.12 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. యాంకరింగ్ మాత్రమే కాకుండా పలు వేదికల ద్వారా ఆమె భారీ ఆదాయం పొందుతోంది. సినిమా ఈవెంట్ల విషయానికి వస్తే, ఒక ప్రీ మూవీ రిలీజ్ ఈవెంట్, ఆడియో లాంచ్ లేదా సక్సెస్ మీట్‌కు సుమ రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఒక ఈవెంట్‌ను తన ఎనర్జీతో నిలబెట్టగలిగే యాంకర్ కావడంతో ఈ రేంజ్ లో తీసుకుంటుందట.

ఇక సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలకు కూడా సుమకు మంచి డిమాండ్ ఉందట. హీరో, హీరోయిన్లతో సరదాగా మాట్లాడుతూ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఇంటర్వ్యూను ఆసక్తికరంగా మలచడం ఆమె ప్రత్యేకత. అందుకే ఒక్కో ఇంటర్వ్యూకే రూ.3 లక్షల వరకు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. టెలివిజన్‌లో ప్రసారమవుతున్న సుమ అడ్డా వంటి కార్యక్రమాల ద్వారా ఆమెకు భారీ ఆదాయం వస్తోందని తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2.5 లక్షల వరకు అందుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ షోకు మంచి ఆదరణ లభించడంతో సుమ టీవీ క్రేజ్ ఇంకా పెరిగిందని అంటున్నారు.

ఇక ఈవెంట్‌లు, ప్రైవేట్ ఫంక్షన్‌లు, అవార్డు వేడుకలు, భారీ బ్రాండ్ షోలు వంటి ప్రత్యేక కార్యక్రమాలకు కూడా సుమ భారీ మొత్తాలు అందజేసే సమాచారం. ఒక్కో పెద్ద ఈవెంట్‌కు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది కార్య స్థాయి, బ్రాండ్, వ్యవధి బట్టి పారితోషికం కూడా మారుతుందట.

sai నేను బతికి ఉన్నానంటే కారణం అదే.. మెగా హీరో ఎమోషనల్ కామెంట్స్సుమ సంపాదన యాంకరింగ్ వరకే పరిమితం కాలేదు. ఆమెకు స్వంత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, యూట్యూబ్ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు, సోషల్ మీడియా కోలాబరేషన్‌లు కూడా అదనపు ఆదాయం తెస్తున్నాయని సమాచారం. అంతేకాదు, అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. సుమ విజయానికి ప్రధాన కారణం ఆమె క్రమశిక్షణ, టైమింగ్, హార్డ్‌వర్క్ అని ఇండస్ట్రీలో చాలామంది చెబుతుంటారు.అందుకే కొత్త యాంకర్లు వచ్చినా సుమ స్థానం మాత్రం అలాగే ఉంది. సుమ ఈజ్ ఎవర్ గ్రీన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X