Bigg Boss Telugu 7: ఈవారం ఎలిమినేషన్ అయ్యేది వాళ్లే.. మిరాకిల్ జరిగితే తప్ప మారే ఛాన్సే లేదు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రసవత్తరంగా మారుతోంది. రోజుకో రకమైన ట్విస్ట్ తో ఎవరూ ఊహించని విధంగా షో సాగుతోంది. ముఖ్యంగా ఉల్టాపుల్టా కాన్సెప్ట్ తో వచ్చి జనాల అంచనాలను తారుమారు చేసేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు విన్న ర్ అనుకున్న వాళ్లు ఇప్పుడు విజేతగా నిలిచే ఛాన్స్ లేకుండా పోయింది. అలాగే వర్త్ లేని కంటెస్టెంట్లు ఇంకా ఇంట్లోనే కొనసాగుతున్నారని. ఈక్రమంలోనే 12వ వారం మరింత అద్భుతంగా సాగుతోంది. మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ అంటూ సరికొత్త టాస్క్ తో ముందుకు వచ్చారు బిగ్ బాస్.

అయితే ఈ టాస్క్ లో అద్భుతంగా ఆడుతున్నారు కంటెస్టెంట్లు. ఎప్పటిలాగే సీరియల్ బ్యాచ్ కు చెందిన వాళ్లు కలిసే గేమ్ ఆడడం.. వాళ్లలోనే ఒకరు విజేతగా నిలవబోతున్నారని తెలిసి చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. ఈ వారం మాత్రం ఓటింగ్ లో టాప్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. రెండో స్థానంలో శివాజి, మూడో స్థానంలో అమర్ దీప్, నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్, ఐదో స్థానంలో గౌతమ్ కృష్ణ, ఆరో స్థానంలో అంబటి అర్జున్, ఏడో స్థానంలో రతికా రోజ్, ఎనిమిదో స్థానంలో అశ్విని ఉన్నారు.

Ashwini Sri And Rathika Rose Will Eliminate in this Week Bigg Boss Telugu 7

ఇలా చూసుకుంటే డేంజర్ జోన్ లో మొత్తం నలుగురు ఉన్నారు. కానీ ఈవారం కచ్చితంగా ఎలిమినేట్ అయ్యేది మాత్ర అశ్విని శ్రీ, రతికా రోజ్ అని తెలుస్తోంది. శనివారం ఎపిసోడ్ లో ఒకరిని, ఆదివారం ఎపిసోడ్ లో మరొకరిని ఇంటి నుంచి బయటకు పంపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ముందు నుంచి ఓటింగ్ లో చివరగా ఉన్న అశ్విని శ్రీ ని శనివారం రోజే ఇంట్లోంచి పంపించేస్తారని టాక్ నడుస్తోంది. ఇక ఆదివారం రోజు రతికా రోజ్ ను పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓటింగ్ పరంగానే ఎలిమినేట్ చేస్తే కచ్చితంగా ఈమెనే ఎలిమినేట్ కావాలి.

కానీ బిగ్ బాస్ ఏదైనా ప్లాన్ వేసి తనకు నచ్చిన వాళ్ను ఉంచుకొని వేరే వాళ్లను పంపించాలనుకుంటే మాత్రం ట్విస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. శనివారమే అశ్విని శ్రీని బయటకు పంపి.. ఆదివారం ఎపిసోడ్ లో రతికా, ప్రిన్స్ యావర్లను డేంజర్ జోన్ లో గనుక ఉంచితే.. పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడాల్సి వస్తుంది. ఈవారం కచ్చితంగా వాడాల్సిందే కాబట్టి.. యావర్ కోసమే ఎవిక్షన్ పాస్ వాడుతాడు. యావర్ కాకుండా.. గౌతమ్, అంబటి అర్జున్ లు ఉన్నా.. రతికా రోజ్ కు తప్ప మిగతా వాళ్లకే వాడే ఛాన్స్ ఉంది.

Ashwini Sri And Rathika Rose Will Eliminate in this Week Bigg Boss Telugu 7

ఇదే జరిగితే అశ్విని, రతికా రోజ్ లు ఎలిమినేట్ అవుతారు. కానీ బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇచ్చినా, సీక్రెట్ రూం కాన్సెప్ట్ తో వచ్చినా రతికా రోజ్ సేవ్ అయిపోయినట్లే. గతవారం ముద్దుబిడ్డను కాపాడుకునేందుకు ఎలిమినేషన్ ప్రాసెస్ నే ఎత్తేసిన బిగ్ బాస్... మరి ఈసారి ఏం చేయనున్నారో తెలియాలంటే మాత్రం రేపటి వరకూ ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X