Bigg Boss Elimination: మళ్లీ షాకింగ్ ఎలిమినేషన్.. ఆ లేడీస్‌కు తక్కువ ఓట్లు.. కానీ అతడిని పంపే ఛాన్స్

తెలుగులోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో ఆదరణను సొంతం చేసుకుని తిరుగులేని షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. ఈ జోష్‌లోనే నిర్వహకులు వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను కూడా సరికొత్త కాన్సెప్టుతో ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు. ఇక, ఇందులో ఎక్కువగా ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పదో వారంలో కూడా షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ వారం ఎవరు వెళ్లే ఛాన్స్ ఉందో మీరే చూసేయండి!

నిరాశను మిగిల్చి.. రంజుగానే

నిరాశను మిగిల్చి.. రంజుగానే

చాలా భాషల కంటే తెలుగులో వస్తున్న బిగ్ బాస్ షోకే ఆదరణ భారీ స్థాయిలో సొంతం అవుతుంది. దీంతో నిర్వహకులు ఎన్నో అంచనాలతో ఆరో సీజన్‌ను తీసుకు వచ్చారు. కానీ, దీనికి ఆరంభంలోనే అత్యల్ప స్పందన దక్కింది. దీంతో క్రమంగా సరికొత్త ప్రయోగాలతో సాగే టాస్కులు ఇస్తూ షోను రంజుగా నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా రేటింగ్‌ను పెంచుతున్నారు.

తొమ్మిది మంది ఎలిమినేషన్

తొమ్మిది మంది ఎలిమినేషన్

ఆరో సీజన్‌లోకి అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, శ్రీ సత్య, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు వచ్చారు. వీరిలో ఇప్పటి వరకూ తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోయారు.

ఈ వారం 9 మంది నామినేట్

ఈ వారం 9 మంది నామినేట్

మునుపటి సీజన్ల కంటే తాజాగా నడుస్తోన్న దానిలో మాత్రం నామినేషన్స్ టాస్కుల్లో గొడవలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే గత సోమవారం జరిగిన పదో వారం నామినేషన్స్ టాస్కు కూడా రచ్చగా సాగింది. ఇక, ఈ వారంలో ఇనాయా సుల్తానా, బాలాదిత్య, ఆది రెడ్డి, శ్రీహాన్, కీర్తి భట్, రేవంత్, జబర్ధస్త్ ఫైమా, మెరీనా అబ్రహం, వాసంతి కృష్ణన్‌లు నామినేట్ అయ్యారు.

ఈ వారం ఓటింగ్‌లో ట్విస్ట్‌లే

ఈ వారం ఓటింగ్‌లో ట్విస్ట్‌లే

ఇప్పటి వరకూ బిగ్ బాస్ ఆరో సీజన్‌లో జరిగిన ఎలిమినేషన్స్ అన్నీ ఊహించని విధంగానే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే పదో వారంలో సైతం ఓటింగ్ విభిన్నంగా సాగినట్లు తెలుస్తోంది. ఇందులో మొదటి నుంచి చివరి వరకూ కంటెస్టెంట్ల స్థానాల్లో మార్పులు కనిపించాయి. ప్రతిరోజూ ఒక్కోరకంగా పోలింగ్ జరిగింది. దీంతో ఈ వారం కూడా ట్విస్టులు కనిపించినట్లు తెలిసింది.

టాప్ కోసం ఇద్దరు.. చివరిలో

టాప్ కోసం ఇద్దరు.. చివరిలో

సాధారణంగా ఈ సీజన్‌లో రేవంత్ ఎప్పుడు నామినేషన్స్‌లోకి వచ్చినా అతడికే ఎక్కువ ఓట్లు పడడం జరిగేది. కానీ, పదో వారంలో మాత్రం ఊహించని విధంగా అతడి కంటే ఇనాయా సుల్తానాకు ఎక్కువ ఓటింగ్ జరిగినట్లు బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది. అలా వీళ్లిద్దరూ టాప్ ప్లేస్‌ కోసం పోటీ పడ్డారని సమాచారం. అయితే, చివర్లో రేవంత్ ఫ్యాన్స్ పుంజుకుని అతడిని టాప్‌లో పెట్టారట.

అషు రెడ్డి 'కామం' వీడియో వైరల్: వాళ్లకు మాత్రమేనట.. కింద కామెంట్స్ చూశారంటే!

వాళ్లంతా దాదాపుగా సేఫ్‌గానే

వాళ్లంతా దాదాపుగా సేఫ్‌గానే

పదో వారం చాలా ట్విస్టులతో సాగిన ఓటింగ్‌తో కంటెస్టెంట్ల స్థానాలు ఎలా ఉన్నాయి అనే దానిపై సమాచారం తెలిసింది. దీనిబట్టి ఈ వారంలో రేవంత్, ఇనాయా టాప్ 2 ప్లేసుల్లో స్థిరపడిపోయారు. ఇక, శ్రీహాన్ మూడో స్థానంలో, ఆది రెడ్డి నాలుగో స్థానంలో, జబర్ధస్త్ ఫైమా ఐదో స్థానంలో, కీర్తి భట్ ఆరో స్థానంలో ఉన్నట్లు తెలిసింది. దాదాపు వీళ్లంతా సేఫ్ అవుతారని టాక్.

10వ వారంలో వెళ్లేది ఎవరు?

10వ వారంలో వెళ్లేది ఎవరు?

పదో వారానికి సంబంధించిన ఓటింగ్‌‌లో బాలాదిత్య ఏడో స్థానంలో ఉన్నాడట. అలాగే, మెరీనా ఎనిమిదో స్థానంలోనూ, వాసంతి కృష్ణన్ తొమ్మిదో స్థానంలోనూ ఉన్నట్లు తెలిసింది. అంటే వీళ్ల ముగ్గురిలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు, ఈ వారం బాలాదిత్యను పంపించే అవకాశాలు ఉన్నాయని బుల్లితెర వర్గాల్లో ఓ టాక్ కూడా వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X