Bigg Boss 9 Telugu 10th Week Elimination: మారిన బిగ్ బాస్ ఓటింగ్.. ఆ కంటెస్టెంట్స్‌కు ముప్పు తప్పదా?

Bigg Boss 9 Telugu 10th Week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో చివరి దశలోకి అడుగుపెడుతోంది. కేవలం ఆరు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో హౌస్‌లో టెన్షన్ మరింత పెరిగిపోయింది. అందులోనూ ఈ వారం నామినేషన్లు సాగిన తీరు ఎవ్వరూ కూడా అంచనా వేయలేనిది, డ్రామా, క్లాష్‌లు, ట్విస్ట్‌లు కలిసి ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచేశాయి. అయితే సంచలనంగా బిగ్ బాస్ తీసుకున్న ఒక నిర్ణయం ఈ సీజన్ మొత్తానికే కొత్త టర్న్ ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? ఎవరు సేఫ్ జోన్ ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్ లో నిలిచారు? ఈ వారం ఎలిమినేట్ అయ్యేంది ఎవరు? అనేది ఓ లూక్కేయండి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో పదోవారం ఎన్నాడు చూడని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేవలం ఆరు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రతి నిర్ణయం, ప్రతి ట్విస్ హౌస్ మూడ్‌ను పూర్తిగా మార్చేస్తోంది. అయితే 10వ వారం నామినేషన్స్ మాత్రం సీజన్‌లో ఇప్పటిదాకా ఎప్పుడూలేని రీతిలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. సాధారణంగా కంటెస్టెంట్ల మధ్య నామినేషన్స్ జరుగుతాయి. కానీ, ఈ వారం బిగ్ బాస్ నేరుగా భారీ షాక్ ఇస్తూ 11 మందిలో 10 మందిని నామినేట్‌ చేశారు. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ మాత్రమే సేఫ్ జోన్‌లో నిలవగా మిగతా హౌస్‌మేట్స్ అందరూ నేరుగా నామినేట్ కావడం హౌస్ కే కాదు, ప్రేక్షకులకూ షాక్ ఇచ్చింది.

Bigg Boss 9 Telugu 10th Week Elimination

పదో వారం నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ మరింత నాటకీయంగా రూపొందించాడు. హౌస్‌మేట్స్‌ను గార్డెన్ ఏరియాలో షవర్ కింద కూర్చోబెట్టి, ఎవరు నామినేట్ అవుతారో వారి మీద బురద నీరు పడేలా టాస్క్ ఏర్పాటు చేశారు. దీంతో నామినేషన్స్ మాటల యుద్ధానికి, భావోద్వేగాలకు, విమర్శలకు వేదిక అయ్యాయి. ఈ క్రమంలో ఇమ్మాన్యుయేల్-భరణి, రీతూ-దివ్య నిఖితా, గౌరవ్-సంజనా మధ్య మాటల యుద్ద జరిగింది. దీంతో హౌస్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ ప్రక్రియ ముగిసిందనుకునే సమయంలో "ఈ వారం అందరూ నామినేట్" అంటూ బిగ్ బాస్ సంచలన ప్రకటన చేశారు.

దీంతో హౌస్ లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్‌కు ఇమ్యూనిటీ పవర్ ఉండటంతో సేఫ్ అయ్యారు. పది మంది నేరుగా ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లారు. ఈ వారం నామినేట్ అయిన వారిలో భరణి శంకర్, దివ్య నిఖిత, రీతూ చౌదరి, గౌరవ్ గుప్తా, సంజనా గల్రానీ, కళ్యాణ్ పదాల, నిఖిల్ నాయర్, సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామి, డీమాన్ పవన్ ఇలా పది మంది ఎలిమినేట్ అయ్యారు. ఈ "ఆల్ నామినేషన్ ట్విస్ట్" సీజన్ 9లో ఇప్పటివరకు జరిగిందిలోనే అతిపెద్ద ట్విస్ట్‌గా నిలిచింది.

ప్రభాస్ 'స్పిరిట్' మూవీలో చిరంజీవి? సందీప్ రెడ్డి వంగా క్లారిటీ.. ఇక బాక్సాఫీస్‌కి దడే
ఇలా పది మంది నామినేట్ కావడంతో అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్ల కోసం భారీ స్థాయిలో ఓటింగ్ చేస్తున్నారు. తాజా సోషల్ మీడియా ఓటింగ్ ట్రెండ్స్‌ ప్రకారం తనూజ పుట్టస్వామి 29.1 శాతం ఓటింగ్‌తో టాప్‌లో కొనసాగుతోంది. ఆమె తర్వాత కళ్యాణ్ పదాల 18.55 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలవగా, అందరూ ఊహించని విధంగా సుమన్ శెట్టి 10.04 శాతం ఓట్లతో టాప్ 3లోకి ఎగబాకి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక భరణి 9.21% ఓట్లతో సేఫ్ జోన్‌లోకి చేరినట్లు అంచనా.

ఇక మిగతా కంటెస్టెంట్ల పరిస్థితి మాత్రం అంతగా బాగాలేదనే చెప్పాలి. తాజా ఓటింగ్ ప్రకారం డీమాన్ పవన్ 6.7 శాతం, సంజనా గల్రానీ 6.11 శాతం, దివ్య నిఖిత 5.89 శాతం, రీతూ చౌదరి 4.88 శాతం, నిఖిల్ నాయర్ 4.82 శాతం, గౌరవ్ గుప్తా 4.71 శాతం ఓట్లు పొందారు. వీరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ప్రత్యేకంగా చివరి నాలుగు స్థానాల్లో ఉన్న దివ్య, రీతూ, నిఖిల్, గౌరవ్ పరిస్థితి అత్యంత క్రిటికల్‌గా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. వీరు నలుగురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశముంది. అయితే ఓటింగ్ ఇంకా కొనసాగుతుండటంతో ర్యాంకులు ఎప్పుడైనా మారవచ్చు.

మొత్తం మీద, బిగ్ బాస్ ఇచ్చిన ఈ "ఆల్ నామినేషన్ ట్విస్ట్" సీజన్‌ను మళ్లీ రసవత్తర దశకు తీసుకెళ్లింది. ఈ వారం ఎవరు సేవ్ అవుతారు, ఎవరు హౌస్‌ను వదిలి వెళ్లాల్సి వస్తుంది అన్నది పూర్తిగా ప్రేక్షకుల ఓట్లపైనే ఆధారపడి ఉంది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే.. ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X