బిగ్ బాస్ తరువాత నా కళ్లు తెరుచుకున్నాయి.. గీతా మాధురి షాకింగ్ కామెంట్స్
సింగింగ్‌కి కొత్త అర్థం చెప్పిన స్వరం, ప్రతి పాటతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గీతా మాధురి (Geetha Madhuri) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లో హిట్ సాంగ్స్‌తో పాటు బుల్లితెరపై తన ఉనికితో ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఆమె, ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కెరీర్‌లో బిజీగా కొనసాగుతూ, వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలకు పదే పదే క్లారిటీ ఇస్తున్నా... చర్చ మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో తర్వాత తన ఆలోచనలు పూర్తిగా మారిపోయాయని, 'నా కళ్లు తెరుచుకున్నాయి' అంటూ గీతా మాధురి చేసిన షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇటీవల సింగర్ గీతామాధురి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన బిగ్ బాస్ అనుభవం గురించి మాట్లాడుతూ.. తమ సీజన్ అన్ని వర్గాల ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అయిందని చెప్పింది. బిగ్ బాస్ కాన్సెప్ట్‌తో పాటు కంటెస్టెంట్ల పర్ఫార్మెన్స్ కంటే కూడా ఎడిటర్ల ప్రోమో కటింగ్స్, ప్రెజెంటేషన్ చాలా బలంగా ఉండటమే షోకు పెద్ద ప్లస్ అయిందని పేర్కొంది. బిగ్ బాస్ సీజన్ ముగిసిన తర్వాత తమ మధ్య ప్రత్యేకమైన బాండింగ్ ఏర్పడిందని గీతా మాధురి వెల్లడించింది. గీతా మాధురి బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో పాల్గొని, టైటిల్ గెలవకపోయినా రన్నర్‌గా నిలిచారు.

హౌస్‌లో ఉన్నప్పుడు గొడవలు, మాటపోటీలు జరిగినా... బయటకు వచ్చిన తర్వాత మాత్రం అందరూ చాలా ఫ్రెండ్లీగా మారిపోయామని తెలిపింది. 'మన సీజన్ అనుకుంటేనే ఒక ప్రత్యేక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పటికీ అదే సీజన్ గురించి మాట్లాడుకుంటాం' అంటూ చెప్పింది. అంతేకాదు, తమ అందరికీ ఒక స్పెషల్ గ్రూప్ ఉందని, అందులో బర్త్‌డే విషెస్, చిన్న చిన్న మూమెంట్స్, స్పెషల్ ఈవెంట్స్ అన్నీ ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటామని వివరించింది.
బిగ్ బాస్ తర్వాత కౌశిక్‌ను కలిశారా? వారి మధ్య ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? అనే ప్రశ్నలకు గీతా మాధురి క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చింది. 'మేమిద్దరం కలిసి ఆర్జే చేతులతో ఒక ఫన్నీ ఇంటర్వ్యూ ఇచ్చాం. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. కౌశిక్ మా ఇంటికి కూడా వచ్చాడు. మా అమ్మాయి పుట్టినప్పుడు కలిశాం. నేను కూడా అతని బర్త్‌డే పార్టీలకు వెళ్లాను. మా మధ్య ఎలాంటి ద్వేషాలు లేవు' అంటూ స్పష్టంగా చెప్పింది.
బిగ్‌బాస్ భామకు 150 మంది బాడీగార్డ్స్ ? అసలు విషయం ఇదేనా?
బిగ్ బాస్ జర్నీ నుంచి ఏమి నేర్చుకున్నారు? అనే ప్రశ్నకు గీతా మాధురి షాకింగ్ సమాధానం ఇచ్చారు. 'బిగ్ బాస్ షో తర్వాత నా కళ్లు తెరుచుకున్నాయి. అప్పటివరకు అందరూ మంచివాళ్లే, మనవాళ్లే అనే ఒక స్వభావంతో ఉండేదాన్ని. చూసినది, విన్నది అన్నీ నిజమే అని గుడ్డిగా నమ్మేదాన్ని. ఇప్పుడు అలా కాదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం నేర్చుకున్నాను. ఎమోషనల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా ఆలోచించడం మొదలుపెట్టాను'అని చెప్పింది.
అంతేకాదు, బిగ్ బాస్‌లో మొదటి మూడు వారాలు తనకు పెద్దగా సపోర్ట్ లేదని, కానీ చివరి మూడు వారాల్లో అందరూ ఫ్రెండ్స్‌గా మారిపోయారని వెల్లడించింది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క బాండింగ్ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని, ఇవన్నీ తనకు అచీవ్‌మెంట్స్‌లా అనిపిస్తున్నాయని చెప్పింది. మొత్తానికి, 'బిగ్ బాస్ అనేది నాకు ఒక లవ్లీ జర్నీ' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. గీతా మాధురి చేసిన ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











