1800 కోసం అలాంటి పనులు చేశా.. ఈ క్షణమైన చనిపోవడానికి సిద్దమే..

ఒకప్పుడు నెలకు కేవలం రూ.1800 జీతం కోసం చిన్న చిన్న పనులు చేస్తూ జీవితాన్ని గడిపిన ఓ అమ్మాయి.. ఈరోజు సోషల్ మీడియాలో స్టార్‌గా, టీవీ షోలలో బిజీగా మారింది. అంతేకాదు.. బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొని క్రేజ్ సంపాదించుకుంది. అద్దె కట్టేందుకు డబ్బులు కూడా సరిపోని పరిస్థితి నుంచి, ఒకేసారి ఐదారు జాబులు చేస్తూ కష్టపడి పైకి వచ్చిన ఈ యాంకర్ జీవితం నిజంగా ఇన్‌స్పైరింగ్ స్టోరీగా మారింది. కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఎదుర్కొంది. ఇప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఎవరు? ఎందు ఆమె ఎమోషనల్ కామెంట్స్ చేసింది?

ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరో కాదు.. అరియానా గ్లోరీ (Ariyana Glory). టిక్‌టాక్ వీడియోలతో మొదలైన ఆమె ప్రయాణం, బిగ్‌బాస్ రియాలిటీ షోతో మరింత పాపులర్ అయ్యింది. ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న అరియానా, తన వ్యక్తిగత జీవితం, కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలు గురించి ఎమోషనల్‌గా పంచుకుంది.

Bigg Boss Fame Ariyana Glory Emotional Comments Go Viral From 1800 Salary to Stardom

2 2 ఏళ్ల కఠోర సాధన.. రోజుకు 32 కి.మీ. రన్నింగ్.. 23 కేజీలు వెయిట్ లాస్ఆ ఇంటర్వ్యూలో తన అసలు పేరు అరియానా కాదని, తల్లిదండ్రులు పెట్టిన పేరు 'అర్చన' అని వెల్లడించింది. అయితే ఆ పేరుతో ఉన్న సమయంలో ఎక్కువ కష్టాలు ఎదురయ్యాయని భావించి, తానే పేరు మార్చుకుని 'అరియానా'గా మారినట్లు చెప్పింది. 'ఇప్పుడు ఆ పేరుతో నేను సంతోషంగా ఉన్నాను' అంటూ తెలిపింది. కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను గుర్తుచేసుకుంటూ ఆమె చెప్పిన విషయాలు హార్ట్ టచ్చింగ్ మారాయి. ఒకప్పుడు నెలకు కేవలం రూ.1800 జీతంతో పనిచేసిన రోజులు ఉన్నాయని, అయితే అద్దె మాత్రం రూ.3000 ఉండేదని తెలిపింది.

అద్దె కట్టేందుకు దాచుకున్న డబ్బులు కూడా దొంగిలించబడిన ఘటన తన జీవితంలో చాలా కఠినమైన అనుభవమని పేర్కొంది. ఆ పరిస్థితుల్లో ఒకేసారి ఐదు ఆరు పనులు చేస్తూ జీవించాల్సి వచ్చిందని చెప్పింది. అనుకోకుండా యాంకరింగ్ రంగంలోకి వచ్చిన విషయాన్ని కూడా అరియానా వివరించింది. ఒక రోజు టీవీలో యాంకర్స్ కావాలన్న ప్రకటన చూసి ఆడిషన్స్‌కు వెళ్లగా, అదృష్టవశాత్తూ సెలెక్ట్ అయ్యానని తెలిపింది. అక్కడి నుంచి చిన్న చిన్న అవకాశాలతో తన ప్రయాణం మొదలై, ఇప్పుడు మంచి స్థాయికి చేరుకున్నానని చెప్పింది.

ఇక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన షాకింగ్ కామెంట్ ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. తనకు ఇష్టమైన దేవుడు గురించి ప్రశ్నించగా, తాను క్రిస్టియన్‌గా పెరిగినా ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిపై విశ్వాసం పెరిగిందని చెప్పింది. 'దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే... నన్ను తన దగ్గరకు తీసుకెళ్లమని అడుగుతాను. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను... ఈ క్షణమే చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాను' అంటూ ఎమోషనల్‌గా చెప్పింది.

అరియానా వ్యాఖ్యలు ప్రేక్షకులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసాయి. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత వచ్చిన స్థిరత్వం, మానసిక ప్రశాంతతను ఆమె ఇలా వ్యక్తపరిచిందని కొందరు భావిస్తుండగా... మరికొందరు మాత్రం ఈ వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అరియానా కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X