2 ఏళ్ల కఠోర సాధన.. రోజుకు 32 కి.మీ. రన్నింగ్.. 23 కేజీలు వెయిట్ లాస్

ఈతరం హీరోలు పాత్ర కోసం ఎంత కష్టానికైనా సిద్ధమవుతున్నారు. పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అవ్వడానికి ఎంత దూరమైనా వెళ్తున్నారు. ఫిజికల్ గా, మెంటల్ గా తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఇటీవల 'పెద్ది' సినిమా కోసం రామ్ చరణ్ మేకోవర్ అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. తాజాగా అదే బాటలో యంగ్ హీరో శర్వానంద్ నడుస్తున్నారు. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండే శర్వానంద్.. సన్నగా బక్కపల్చగా తయారై కనిపించి షాక్ ఇచ్చారు. తన 'బైకర్' సినిమాలోని పాత్ర కోసమే ట్రాన్సఫామ్ అయ్యారు. దీని వెనకున్న కష్టాన్ని తెలియజేస్తూ శర్వా తాజాగా ఓ వీడియో పంచుకున్నారు.

Also Read
Dhurandhar 2 Day 11 Collections: 'ధురంధర్ 2' జైత్రయాత.. రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Dhurandhar 2 Day 11 Collections: 'ధురంధర్ 2' జైత్రయాత.. రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

శర్వానంద్ హీరోగా, అభిలాష రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మోటో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బైకర్ (Biker) కోసం ఈ భారీ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. ఈ సినిమాలో ఆయన 18 ఏళ్ల యువ బైకర్ పాత్రలో కనిపించాల్సి రావడంతో, తనను తాను పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. మాళవిక నాయర్‌ హీరోయిన్ గా నటించగా.. డా.రాజశేఖర్‌ ముఖ్య పాత్ర పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 3న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Sharwanand s Shocking Transformation for Biker 32 KM Daily Run 2-Year Journey

ఈ సినిమా కోసం శర్వానంద్ పడిన కష్టాన్ని ఆయన స్వయంగా వీడియో రూపంలో వివరించారు.'గత రెండేళ్లుగా నా జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నా దినచర్య మొదలయ్యేది. స్ట్రెచ్చింగ్‌, యోగా, ప్రాణాయామం, హెవీ ట్రైనింగ్... ఇలా నా రోజు ప్రారంభమయ్యేది' అని తెలిపారు. ఒక దశలో రోజుకు ఉదయం, సాయంత్రం కలిపి నాలుగు రౌండ్లుగా మొత్తం 32 కి.మీ. వరకు నడక, పరుగులు చేశానని చెప్పారు.

Recommended For You
'అప్పటినుంచి నా జీవితం మారిపోయింది'.. రామ్ చరణ్ బ్యూటీ భావోద్వేగం..
'అప్పటినుంచి నా జీవితం మారిపోయింది'.. రామ్ చరణ్ బ్యూటీ భావోద్వేగం..

ఈ ప్రయాణం కేవలం శారీరక మార్పుతో ముగిసిపోలేదని, మానసికంగా కూడా ఇది చాలా కఠినమైన దశగా అనిపించిందని శర్వానంద్ వెల్లడించారు. 'అది నా జీవితంలో అత్యంత నిరాశ, నిస్పృహలతో కూడిన సమయం. అయినప్పటికీ, నేను వెనక్కి తగ్గలేదు. ఏదైనా సాధించాలంటే కష్టపడాల్సిందే అని నమ్మాను' అని చెప్పారు. ఈ మాటలు ఆయన పట్టుదలని, కట్టుదిట్టమైన సంకల్పాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

You May Also Like
అవకాశాల కోసం కొందరూ లొంగిపోతున్నారు.. కానీ..
అవకాశాల కోసం కొందరూ లొంగిపోతున్నారు.. కానీ..

ప్రత్యేకంగా యోగా తన జీవితంలో కీలక పాత్ర పోషించిందని శర్వానంద్ పేర్కొన్నారు. యోగా చేయడం వల్ల తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని, నెమ్మదిగా ఆలోచించడం, అవసరం లేని మాటలు తగ్గించడం, ముఖ్యమైన విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం వంటి లక్షణాలు తనలో పెరిగాయని చెప్పారు. అంతేకాకుండా శీర్షాసనం వంటి కఠినమైన యోగాసనాలను కూడా సాధన చేశానని తెలిపారు.

 'సుధీర్‌ను అలా మిస్ అయ్యా.. ఆ విషయంలో చాలా బాధపడ్డా '
'సుధీర్‌ను అలా మిస్ అయ్యా.. ఆ విషయంలో చాలా బాధపడ్డా '

మొదటగా 6-7 కిలోల బరువు తగ్గిన తర్వాత కూడా ఆగిపోకుండా, ఇంకా మెరుగైన ఫిజిక్ కోసం తన ట్రైనింగ్ కొనసాగించారని శర్వానంద్ చెప్పారు. 'ఇది కేవలం సినిమా కోసం చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ కాదు.. ఇది నా కోసం చేసిన ప్రయాణం' అని ఆయన చెప్పడం ఈ మార్పు వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. ఈ కఠిన సాధన తర్వాత ఒక రోజు అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు, 'నేను రెడీ అయ్యాను... నేను అప్‌డేట్ అయ్యాను' అన్న భావన కలిగిందని ఆయన తెలిపారు.

@ Prabhas vs Salman Khan: ప్రభాస్, సల్మాన్ ఖాన్ పోటాపోటీ.. భారీ బాక్సాఫీస్ క్లాష్ తప్పదా?ఇక చివరగా శర్వానంద్ ' నాకు సాధ్యమైతే... ప్రతి ఒక్కరికీ సాధ్యమే' అని చెప్పి, కష్టపడి సాధించాలనే సంకల్పం ఉంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని సూచించారు. మొత్తంగా చూస్తే, 'బైకర్' సినిమా కోసం శర్వానంద్ చేసిన ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ కేవలం ఫిజికల్ మార్పు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వంలో వచ్చిన గొప్ప మార్పుకు నిదర్శనం. ఈ సినిమా ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఆయన కొత్త అవతారాన్ని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X