నాలోని రాక్షసుడు బయటకు వస్తే తట్టుకోలేరు.. డిమాన్ పవన్ వార్నింగ్

బిగ్ బాస్ సీజన్ 9 ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన డిమాన్ పవన్ మరోసారి వార్తల్లో నిలిచారు. కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చి పవన్ .. తన ఆటతీరుతో బీబీ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. చివరి వరకు సీజన్ లో కొనసాగి, టాప్-3 గా నిలిచారు. ఇలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్‌లో తన స్ట్రాంగ్ ఆట, స్ట్రాటజీ, భావోద్వేగ కంటెంట్‌తో ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న ఆయన, ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా డిమాన్ పవన్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అగ్నిపరీక్ష ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆయన, తన ధైర్యం, ఆత్మవిశ్వాసంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలిచాడు. రెండు సార్లు కెప్టెన్‌గా ఎంపికై నాయకత్వ లక్షణాలు చూపించిన పవన్, ఫైనల్ దశ వరకు చేరి టాప్-3లో నిలిచాడు. అయితే కుటుంబ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూ.15 లక్షల సూట్‌కేస్ ఆఫర్‌ను స్వీకరించి షో నుంచి బయటికి రావడం అందరినీ ఎమోషనల్ చేసింది.

Bigg Boss Fame Demon Pavan Reacts Strongly to Trolls and Negativity Issues Warning

ఇక తన తండ్రి ఆరోగ్యం గురించి కూడా పవన్ భావోద్వేగంగా స్పందించాడు. నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తండ్రి దుర్గాప్రసాద్ చాలా కష్టాల్లో ఉన్నప్పటికీ, తనకు మద్దతుగా ప్రజలను కోరినట్టు తెలిపాడు. తండ్రికి మంచి చికిత్స అందించాలనే లక్ష్యంతోనే బిగ్‌బాస్‌లో పాల్గొన్నానని పవన్ వెల్లడించాడు. అయితే.. అనుకున్నట్లుగానే పవన్ తండ్రికి చికిత్స చేయించారు. కానీ, గత నెలలో వ్యాధి తీవ్రత మరింత పెరగడంతో చిక్సిత పొందుతూ.. ప్రాణాలు కోల్పోయారు. ఇలా డిమాన్ పవన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

ఈ నేపథ్యంలో తన తండ్రి మరణంపై తప్పుడు వార్తలు రావడం, అలా డిమాన్ పవన్ ను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై డిమాన్ పవన్ తీవ్రంగా స్పందించారు. తాజాగా తన ఇన్‌స్టా‌గ్రామ్ వేదికగా ఓ షాకింగ్ పోస్టు పెట్టారు.చాలా మంది తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తప్పు చేయకపోయినా కూడా కొంత నెగటివిటీ, ద్వేషాన్ని భరించగలిగే వ్యక్తినని, అందుకే ఇప్పటివరకు మౌనంగా ఉన్నానని చెప్పారు.

అయితే ఆ నెగటివిటీ తనకు మాత్రమే పరిమితమైతే ఓకే కానీ, తనకు దగ్గరైన వారిని టార్గెట్ చేస్తే మాత్రం సహించబోనని హెచ్చరించారు. 'అది మరీ ఎక్కువైతే నాలోని రాక్షసుడు మాట్లాడతాడు.. అప్పుడు మీరు తట్టుకోలేరు' అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారని, అవి తెలియక జరిగే విషయాలేనని, తర్వాత వారు మారతారని నమ్ముతానని ఆయన చెప్పారు.

సుడిగాలి సుధీర్ సీక్రెట్ బయటపెట్టిన ధనరాజ్.. అందుకే ఫోన్లకు దూరం అంటూ..
అందుకే తాను ఎక్కువగా క్షమించడం, ప్రశాంతంగా ఉండడమే ఎంచుకుంటానని వివరించారు. 'నేను మంచికి మంచి చేసే వ్యక్తిని'అని స్పష్టం చేశారు. తనపై ట్రోలింగ్స్ ఆపేయాలని కోరాడు. ప్రస్తుతం డిమాన్ పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన మాటల్లో ఉన్న హెచ్చరికతో పాటు భావోద్వేగం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇకపై ట్రోలింగ్ తగ్గుతుందా? లేక ఈ వ్యాఖ్యలతో మరో చర్చ మొదలవుతుందా? అన్నది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X