పుల్లలు పెట్టడంలో ఆమె ఫస్ట్.. శ్రీముఖిపై బిగ్‌బాస్ నటి షాకింగ్ కామెంట్స్..

అందాల ముద్దుగుమ్మ, యాంకర్ శ్రీముఖి (Sreemukhi) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన అందచందాలు, మాటలతో మాయ చేస్తుంది ఈ బ్యూటీ. పటాస్ అనే కామెడీ షో ద్వారా బుల్లి తెరకు పరిచయం అయింది. తన యాంకరింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకొంది. బుల్లితెర రాములమ్మగా ఓ వెలుగు వెలుగుతోంది. ముఖ్యంగా బిగ్ బాస్ రియాల్టీ షోలో ఈ ముద్దుగుమ్మ చేసిన హంగామా ఎవరూ మర్చిపోరు. తన గొంతుతో, వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకొని రన్నర్ గా నిలిచింది. ప్రస్తుతం రియాల్టీ షోలు, ఈ వెంట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది.తాజాగా ఈ యాంకర్ పై ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరు? ఇంతకీ ఏం జరిగింది?

ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరో కాదు.. శ్రీ సత్య (Sri Sathya). బుల్లితెరపై పలు సీరియల్స్‌తో నటించి, మెప్పించింది. అందులో నిన్నే పెళ్లాడుతా, అత్తారింట్లో అక్కాచెల్లెలు, త్రినయని వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది శ్రీ సత్య. ఆ ఫేమ్ తో బిగ్‌బాస్ సీజన్ 6 లో అడుగుపెట్టే అవకాశం అందుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టి సుమారు 103 రోజుల పాటు తన ఆటతీరుఆకట్టుకుంది. ఈ షో ద్వారా మంచి పాపులర్టీ సంపాదించుకుంది. షార్ట్ ఫిల్మ్స్‌, డ్యాన్స్ షోలు, రియాలిటీ ప్రోగ్రామ్స్‌తో బిజీగా ఉంది. అయితే.. అనుకున్న స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది.

Bigg Boss Fame Sri Sathya Makes Shocking Comments on Sreemukhi and Pradeep Machiraju

ఇటీవల శ్రీ సత్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సమయంలో తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. బిగ్ బాస్ తరువాత లైఫ్ ఎలా ఉండని యాంకర్ ప్రశ్నించగా.. శ్రీ సత్య మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా నేను ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదు. ఎవరితోనూ తిరగడం లేదు. నాలో నేనే ఒక కొత్త మార్పు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ఆరా డిస్టర్బ్ అవుతోంది. కెరీర్‌పై ఫోకస్ పెట్టలేకపోతున్నా.. అనవసరంగా బయట పనులు, ఎంజాయ్మెంట్ ఎక్కువ అవుతున్నాయి. ఇలా ఇతర విషయాలపై కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మన కెరీర్ కు సరైన ప్రాధాన్యం ఇవ్వలేం. కాబట్టి నా అలా చేయడం ఇష్టం లేదు. నేను వర్క్ కే ఇంపార్టెంట్ ఇస్తా' అంటూ తన మైండ్‌సెట్‌ను వివరించింది.

స్పిరిట్, కల్కి 2 తర్వాత.. మరో గ్లోబల్ ప్రాజెక్ట్ నుంచి దీపిక ఔట్?
ఇక 'ఈమధ్య గీతు రాయల్స్‌తో తిరగడం మానేశావా? అని ప్రశ్నించగా.. శ్రీ సత్య ఓ క్లారిటీ ఇచ్చింది. 'ఫ్రెండ్స్‌ని మార్చలేదు. కేవలం ఎంజాయ్ మెంట్ ఎక్కువ అవుతుందని అందరికీ దూరంగా ఉంటున్నట్లు చెప్పింది. అందుకు ప్రధాన కారణం.. కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని మిగతా వాళ్లను దూరంగా ఉంచుతున్నాననీ, గీతుకి ఉన్న నెగటివ్ ఎనర్జీ నాకూ వస్తుందేమో అన్న భయంతో కొంచెం గ్యాప్ తీసుకున్నా అని తెలిపింది. అయితే.. గీతు ఇప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్'అని చాలా క్లారిటీ గా చెప్పింది. అలాగే, 'ఎంజాయ్మెంట్ కోసం అమ్మనాన్నలను దూరం పెట్టడం కరెక్ట్ కాదని తెలిపింది. కుటుంబ విలువల గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.

ఇక యాంకరింగ్ విషయంలో శ్రీముఖి, ప్రదీప్ మాచిరాజులపై శ్రీ సత్య షాకింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా శ్రీముఖిపై నోరుజారింది. ముఖిని చూస్తూ చూస్తూ మనం అలవాటు పడిపోయాం. ఆమెకు పుల్లలు పెట్టడం బాగా అలవాటు. అందులో ఆమె ఫస్ట్, కంటెంట్ కోసం ఇతరులను ఆటపట్టించడం, కంటెంట్ కో ఓ విషయాన్ని సాగదీయడం ఆమెకు అలవాటు. అదే ఆమె స్టైల్..'అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అదే సమయంలో ప్రదీప్ గురించి మాట్లాడుతూ.. ఈ షోలో ఏమైనా కొత్తగా ట్రై చేస్తాడేమో చూడాలి. యాంకరింగ్‌కు గ్యాప్ తీసుకుని రావడంతో కొద్దిగా తేడా కనిపిస్తోంది. తాను ప్రదీప్‌కి పెద్ద ఫ్యాన్‌ ను అని చెప్పుకొచ్చింది. ఇలా శ్రీ సత్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X