Bigg Boss Telugu 7: గేమ్‌లో ఫెయిలైనా కెప్టెన్సీ వాళ్లకే.. కావాలనే కాపాడుతున్న బిగ్‌బాస్.. ప్లాన్ మొత్తం రివీల
బిగ్ బాస్ తెలుగు షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ.. అద్భుతమైన టీఆర్పీతో దూసుకెళ్తోంది. ఏ సీజన్ లో లేనంతగా టీఆర్పీని సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే 12వ వారం పూర్తి కావస్తుండగా... మరికొన్ని రోజుల్లోనే ఈ షో ముగియనుంది. ముందుగా 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపిన బిగ్ బాస్.. ఆ తర్వాత 2.0 పేరుతో మరో ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఇంట్లోకి రప్పించారు. ఆ తర్వాత అప్పటికే ఎలిమినేట్ అయిపోయిన మరో కంటెస్టెంట్ ను కూడా ఇంట్లోకి తెచ్చి గేమ్ ఆడిస్తున్నారు.
ఇలా తమకు నచ్చినట్లుగా, నచ్చిన వారిని తెచ్చుకుంటూ గేమ్ ఆడిస్తున్న బిగ్ బాస్.. ఈసారి కూడా అదిరిపోయే ప్లాన్ వేశారు. తమ ముద్దుబిడ్డలు అయిన వాళ్లే గెలిచే విధంగా.. ముఖ్యంగా కెప్టెన్ లు అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అదే ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేస్తూ.. మిగతా కంటెస్టెంట్లను గాలికొదిలేస్తున్నారు. అయితే తాజాగా 12వ వారంలో జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ చూస్తుంటేనే బిగ్ బాస్ ప్లాన్ అర్థం అవుతుంది. ఆయన వేసే ఎత్తులు, పైఎత్తులతో బిగ్ బాస్ షో మొత్తం వన్ సైడ్ వార్ లా ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ వ్యవహరించిన తీరు సీరియల్ బ్యాచ్ కు సపోర్టింగ్ గా ఉన్నట్లు అర్థం అయిపోతుంది. మర్డర్ టాస్క్ లో మొత్తం నలుగురు హౌస్ మేట్స్ చనిపోయారు. పల్లవి ప్రశాంత్, అశ్విని, గౌతమ్ లను బిగ్ బాస్ యే కావాలని చంపేశారు. ఆయనే పేర్లు చెబుతూ వారిని కంటెండర్ షిప్ నుంచి తొలగించారు. అలాగే మర్డర్ చేయడంలో విఫలం అయిన శివాజిని పక్కకు తప్పించి ఆ పనులను ముద్దుబిడ్డ ప్రియాంక జైన్ కు అప్పగించారు. అయితే పోలీస్ ఆఫీసర్లుగా ఉన్న అమర్ దీప్, అంబటి అర్జున్ లు హంతకులను ఏమాత్రం గుర్తించలేరు.
తమకు నోటికి వచ్చిన పేర్లు చెబుతూ వెళ్లారు. ముందుగా రతికాను, ఆ తర్వాత యావర్ ను, ఆ తర్వాత శివాజి పేరు చెప్పారు. కనీసం అందుకు ఆధారాలు కూడా చెప్పకపోవడం గమనార్హం. ఇదంతా ఒకెత్తు అయితే పోలీసులు కేసును సాల్వ్ చేసి సక్సెక్ ఫుల్ గా టాస్క్ పూర్తి చేశారని.. కాబట్టే వారు కెప్టెన్సీ టాస్క్ కు అర్హులు అని బిగ్ బాస్ ప్రకటించడం మరీ దారుణం. అలాగే రెండో పేరు చెప్పమని పోలీసులను అడగ్గా.. శోభాశెట్టి ప్రియాంక పేరు చెప్పింది. అప్పటికే సీక్రెట్ టాస్క్ ను తన స్నేహితురాలికి అర్థం అయ్యేలా డెడ్ కాకుండా చూసింది ప్రియాంక. ఆ హింట్ తోనే శోభా ఆమెను పట్టేసుకుంది.

ఇలా ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ షిప్ లో సీరియల్ బ్యాచ్ కు చెందిన నలుగురూ ఉన్నారు. అయితే అంబటి అర్జున్, శోభా శెట్టిల్లో ఎవరు కెప్టెన్ కావాలని అనుకుంటున్నారని హౌస్ మేట్స్ ను అడగ్గా.. గౌతమ్ శోభాశెట్టి ఫొటో కాల్చేశాడు. ఇలా చూస్కుంటే ఈ వారం కెప్టెన్ అమర్ దీప్ గెలిచాడని తెలుస్తోంది. ఇది కన్ఫార్మ్ కాకపోయినా.. వీళ్లను గెలిపించేందుకు బిగ్ బాస్ చేస్తున్న ప్లాన్ అయితే మరీ దారుణం అని ప్రేక్షకులు తిట్టిపోస్తున్నారు. విన్నర్ కూడా ఇప్పటికే కన్ఫార్మ్ అయ్యాడని.. కావాలనే సీరియల్ బ్యాచ్ వాళ్లను బిగ్ బాస్ కాపాడుకుంటున్నాడని.. గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నారు. అదే నిజం అన్నట్లుగా బిగ్ బాస్ ప్రూవ్ చేయడం గమనార్హం. చూడాలి మరి ముందు ముందు ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











